News February 1, 2025

HYD: గురుకులల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై TG ప్రభుత్వం కీలక నిర్ణయం

image

రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యను అభ్యసించే విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. ఈ మేరకు హాస్టళ్లు, గురుకులాల్లో ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలను పాటించేందుకు ఎన్ఐఎన్ సహకారం తీసుకోనుంది. ఆహార నాణ్యతతో ప్రమాణాలతో పాటు సిబ్బంది పాటించాల్సిన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రోసిజర్ రూపొందించేందుకు ప్రభుత్వం NIN సహకారం కోరింది.

Similar News

News November 2, 2025

HYD: అమ్మాయిలపై చేయి వేస్తూ అసభ్య ప్రవర్తన

image

బాలికలతో అసభ్యంగా ప్రవర్తించిన యువకులపై పోక్సో చట్టం కింద కేసు నమోదైన ఘటన HYDబంజారాహిల్స్ PS పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు..ఇందిరానగర్‌లో నివసించే ఇద్దరు అమ్మాయిలు బర్త్ డే వేడుకల అనంతరం తమ సోదరుడిని ఇంటికి పంపించి వస్తున్నారు. అదే వీధిలో ఉండే బాలు,నవీన్ వారిపై చేయి వేసి, అసభ్యకరంగా ప్రవర్తించగా బాలికలు వేడుకున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదవగా నిందితులను రిమాండ్‌కు తరలించారు.

News November 2, 2025

HYD: ఇక మొబైల్‌లోనే సులువుగా ఆధార్ అప్‌డేట్

image

ఆధార్ సేవలను యూఐడీఏఐ మరింత సులువు చేసిందని HYDలో అధికారులు తెలిపారు. ఇక నుంచి మొబైల్‌లోనే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. చిరునామా అప్‌డేట్, డాక్యుమెంట్ల అప్‌లోడ్, మొబైల్ నంబర్ అప్‌డేట్ వంటివి మొబైల్‌లోనే చేసుకోవచ్చు. ఈ సేవలు పొందాలంటే యూఐడీఏఐ పోర్టల్ లేదా మై ఆధార్ యాప్ ద్వారా ఆన్‌లైన్ అప్‌డేట్ చేయవచ్చు. కానీ బయోమెట్రిక్, ఐరిస్ వంటి సేవల కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. SHARE IT

News November 2, 2025

HYD: ప్రచారంలో దోశ వేసిన మంత్రి

image

జూబ్లీహిల్స్ పరిధి రహమత్‌నగర్ డివిజన్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉపఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీరామ్ నగర్, సంధ్యా నగర్, కార్మిక నగర్, వినాయకనగర్, ఎస్‌పీఆర్ హిల్స్‌లో పాదయాత్ర నిర్వహించి, ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. అనంతరం ఓ హోటల్‌లో మంత్రి దోశ వేసి సందడి చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించి, ప్రజాపాలనకు మద్దతు తెలపాలన్నారు.