News January 26, 2026
HYD: గురుకులాల్లో ADMISSIONS.. FEB 20 వరకు ఛాన్స్..!

తెలంగాణలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 1,380 సీట్ల భర్తీకి అర్హులైన విద్యార్థుల నుంచి అధికారులు దరఖాస్తులు కోరుతున్నారు. ఈనెల 21 నుంచి ప్రారంభమైన దరఖాస్తులకు ఫిబ్రవరి 20 వరకు అవకాశం కల్పించారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు సమర్పించవచ్చు. మార్చి 29న ప్రవేశ పరీక్ష ఉంటుంది. మరిన్ని వివరాలకు అఫీషియల్ వెబ్‌సైట్‌ను చూడవచ్చు. SHARE IT.
Similar News
News February 23, 2026
అన్నమయ్య: 40 ఏళ్ల వ్యక్తితో అమ్మాయి పరార్

అన్నమయ్య జిల్లా ములకలచెరువులో మైనర్ అదృశ్యం కలకలం రేపింది. సీఐ వెంకటేశులు వివరాల మేరకు.. మండలంలోని నాయనిచెరువుపల్లె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి(40)కి వివాహమై ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆయనకు 17 ఏళ్ల యువతితో పరిచయమైంది. ఈనెల 19వ తేదీ రాత్రి నుంచి యువతి కనిపించడం లేదు. ప్రేమ పేరుతో యువతి ఆ 40 ఏళ్ల వ్యక్తితో వెళ్లిపోయినట్లు ప్రాథమికంగా తమకు తెలిసిందని సీఐ తెలిపారు.
News February 23, 2026
చిన్నవయసులోనే వృద్ధాప్యమా?

వయసుతోపాటు వృద్ధాప్యం రావడం సహజమే కానీ చిన్నవయసులోనే ఈ లక్షణాలు కనిపించడం ఈ మధ్య ఎక్కువవుతోంది. దీనికి జెనెటిక్స్‌తో పాటు మరిన్ని కారణాలు ఉంటాయంటున్నారు నిపుణులు. ఒత్తిడి, నిద్ర, ఆహారం, లైఫ్‌స్టైల్, అతినీలలోహిత కిరణాలు, కాలుష్యం దీనికి కారణాలు. పోషకాహారం, తగినంత నిద్ర, ఒత్తిడి తగ్గించుకోవడంతో పాటు ఫేస్‌వాష్, మాయిశ్చరైజర్, సన్‌స్క్రీన్, విటమిన్ C, నియాసినమైడ్ సీరమ్ వాడాలని సూచిస్తున్నారు.
News February 23, 2026
పల్నాడులో ఇంటర్ పరీక్షలకు కౌంట్‌డౌన్..!

జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఇంటర్మీడియట్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి నీలావతి దేవి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మొత్తం 34,376 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతారన్నారు. పూర్తిగా సీసీ కెమెరాల నిఘాలో నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ఒక నిమిషం ఆలస్యమైనా పరీక్షలకు అనుమతి లేదని పేర్కొన్నారు.


