News October 13, 2025

HYD: గులాబీ దళానికి డ్యామేజ్ తప్పదా!

image

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలో ఓ విషయం BRSకి కొరకరాని కొయ్యగా మారింది. తెలంగాణ రక్షణ సమితి- డెమోక్రటిక్ (TRS- D) పార్టీ తన అభ్యర్థిని బరిలో దింపింది. పేరు, జెండా దాదాపు ఒకేలా ఉండటం.. BRSగా పేరు మారినప్పటికీ చాలా మంది TRSగానే పిలుస్తుండటంతో డ్యామేజ్ తప్పదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కార్యకర్తల్లో భరోసా నింపాలన్నా ఈ బైపోల్ కీలకంగా మారనుంది.

Similar News

News October 13, 2025

జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు గెజిట్‌ విడుదల

image

హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉపఎన్నికకు గెజిట్‌ నోటిఫికేషన్ విడుదలైంది. షేక్‌పేట తహశీల్దార్ కార్యాలయంలోని రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో ఇవాళ్లి నుంచి ఈ నెల 21 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 22న పరిశీలన, 24న ఉపసంహరణకు గడువు ముగుస్తుంది. వచ్చే నెల 11న పోలింగ్‌, 14న ఓట్ల లెక్కింపు జరగనుంది.

News October 13, 2025

HYD: జాగ్రత్త! HSRP పేరుతో మోసాలు!

image

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోలేదంటూ ఇటీవల క్యాబ్ డ్రైవర్లకు నకిలీ ఆర్టీఏ చలాన్ కాల్స్ వస్తున్నాయి. మీకు రూ.3,400 జరిమానా పడిందని మోసగాళ్లు చెబుతున్నారు. దీనిపై ఆందోళన చెందిన ఓ డ్రైవర్ స్థానిక అధికారులను సంప్రదించగా, అది నకిలీ కాల్ అని తేలింది. HSRP సంబంధించి ఎలాంటి తుది గడువును ఇప్పటివరకు ప్రభుత్వం విధించలేదని అధికారులు స్పష్టం చేశారు.

News October 13, 2025

HYD: జనాలకు ప్రశ్నించేతత్వం పోయిందా?

image

జనాలకు ప్రశ్నించేతత్వం పోయిందని ఉదయాన్నే ఓ పెద్దాయన ఎల్బీనగర్‌లోని ఓ పెట్రోల్ బంక్ వద్ద ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏంటని ఆరా తీస్తే.. బంక్‌లో 4 పంపులుంటే ఒకే దగ్గర పెట్రోల్ పోస్తున్నారు. క్యూలైన్ రోడ్డు మీదకు వచ్చింది. ఇంకోటి ఓపెన్ చేయమని జనాలు అడగటం లేదు. అడిగితే పట్టించుకోలేదు. యువతకు ఏమైందసలు ఫ్రీలెఫ్ట్ బ్లాక్ చేసినా, అంబులెన్స్‌కు సైడ్ ఇవ్వకపోయినా కనీసం స్పందిచడంలేదు’ అని ఆవేదన వెళ్లగక్కారు.