News October 13, 2025
HYD: గులాబీ దళానికి డ్యామేజ్ తప్పదా!

జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో రాష్ట్ర రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ఈ ఎన్నికలో ఓ విషయం BRSకి కొరకరాని కొయ్యగా మారింది. తెలంగాణ రక్షణ సమితి- డెమోక్రటిక్ (TRS- D) పార్టీ తన అభ్యర్థిని బరిలో దింపింది. పేరు, జెండా దాదాపు ఒకేలా ఉండటం.. BRSగా పేరు మారినప్పటికీ చాలా మంది TRSగానే పిలుస్తుండటంతో డ్యామేజ్ తప్పదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కార్యకర్తల్లో భరోసా నింపాలన్నా ఈ బైపోల్ కీలకంగా మారనుంది.
Similar News
News October 13, 2025
కాజీపేటలో వందే భారత్ స్లీపర్ కోచ్‌ల తయారీ కేంద్రం..!

కాజీపేట కోచ్ ఫ్యాక్టరీలో వందే భారత్ స్లీపర్ రైళ్లను తయారు చేయాలని రైల్వే బోర్డు ఆలోచిస్తోంది. వివిధ రాష్ట్రాల నుంచి వందే భారత్ స్లీపర్ కోచ్‌లు కావాలని డిమాండ్ పెరుగుతుండటంతో కేంద్రంఈ ఆలోచన చేస్తోంది. దీనికోసం KZPT కోచ్ ఫ్యాక్టరీని కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిసింది. వీలైనంత తొందరలో 200 భారత్ స్లీపర్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తోంది. దీంతో KZPTకు అరుదైన గౌరవం దక్కనుంది.
News October 13, 2025
HNK: లైంగిక వేధింపులకు పాల్పడిన ఉద్యోగిపై కేసు, వేటు

హనుమకొండ కలెక్టరేట్లో రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్న సీనియర్ అసిస్టెంట్ ఇర్ఫాన్ సోహెల్‌పై సుబేదారి స్టేషన్లో SC, ST కేసు నమోదైంది. అదే సెక్షన్లో పని చేస్తున్న ఓ దళిత ఉద్యోగిని పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నారంటూ వచ్చిన ఆరోపణలపై గతంలోనే కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేశారు. బాధితురాలు శనివారం రాత్రి సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
News October 13, 2025
ఇద్దరు సెంచరీ వీరులు ఔట్

ఢిల్లీలో భారత్‌తో జరుగుతున్న రెండో టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ కీలక భాగస్వామ్యానికి తెరపడింది. సెంచరీ హీరోలు ఓపెనర్ క్యాంప్‌బెల్ (115), షై హోప్ (103) ఔటయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో 248 పరుగులకే కుప్పకూలిన కరేబియన్ జట్టు ఫాలో ఆన్‌లో పోరాడుతోంది. ప్రస్తుతం విండీస్ స్కోర్ 289/4 కాగా 19 రన్స్ ఆధిక్యంలో ఉన్నారు.