News February 3, 2026
HYD: గూగుల్‌లో సెర్చ్ చేసి.. SUICIDE

కూకట్‌పల్లికి చెందిన విజయలక్ష్మి (26) మరణం వెనుక విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. 2 రోజుల్లో వస్తానని ఇంట్లో చెప్పి వెళ్లిన ఆమె, హుస్సేన్‌సాగర్‌లో శవమై తేలింది. చనిపోవడం ఎలా అని గూగుల్‌లో సెర్చ్ చేసినట్లు సమాచారం. పెళ్లి కాలేదనే బాధతో ఆమె ఆత్మహత్య చేసుకుందని ప్రచారం జరిగినప్పటికీ, పోలీసులు దానిని ఖండించారు. డిప్రెషన్ వల్లే ఆత్మహత్య చేసుకుందని చెబుతున్నారు. ఏదైనా బతికి సాధించాలని సూచించారు.
Similar News
News February 8, 2026
HYD: రిపబ్లిక్ డేలో అదరగొట్టారు!

రిపబ్లిక్ డే క్యాంప్‌లో అదరగొట్టిన ఏపీ, తెలంగాణ ఎన్‌సీసీ క్యాడెట్లను గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ లోక్ భవన్‌లో మనస్ఫూర్తిగా అభినందించారు. గుర్రపు స్వారీలో పతకాల పంట పండించడంతో పాటు, సాంస్కృతిక ప్రదర్శనలతో దేశాన్ని మెప్పించిన తీరు సూపర్ అని కొనియాడారు. క్రమశిక్షణతో మున్ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. ఈ వేడుకలో ఎయిర్ కమోడోర్ నర్సింగ్ సైలానీ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు.
News February 7, 2026
ఉప్పల్‌లో రేపు మెగా సెమినార్

బాల్యం తర్వాత కొత్త జీవితంలోకి తొలి అడుగు వేసేది 10th క్లాస్ తర్వాతే. అలాంటి కీలకమైన దశలో స్టూడెంట్స్‌తోపాటు వారి తల్లిదండ్రులు ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకునేలా Way2News& Resonance సంస్థ సంయుక్తంగా ఉచిత అవగాహన సదస్సు నిర్వహిస్తున్నాయి. ఉప్పల్ భగాయత్‌లోని SriRasthu Conventionలో రేపు ఉదయం 10:30 గంటలకు జరిగే ఈ సదస్సులో CBI EX జేడీ లక్ష్మీనారాయణ పాల్గొని మార్గనిర్దేశం చేయనున్నారు
News February 7, 2026
HYD: అదుపు తప్పిన కారు.. ఇద్దరు మృతి

HYD శివారులో రోడ్డు ప్రమాదం జరిగింది. పటాన్‌చెరు పరిధి పోచారం ORR మీదుగా బౌరంపేట వెళుతున్న కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. మృతులు నవీన్, మౌనికగా పోలీసులు గుర్తించారు. మరో నలుగురి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు దర్యాప్తు చేపట్టారు. జూ పార్క్ నుంచి ఇంటికి వెళుతుండగా ఈ యాక్సిడెంట్ జరిగినట్లు సమాచారం.


