News November 11, 2025
HYD: గృహ ప్రవేశం.. ఓనర్‌ను ఘోరంగా కొట్టిన హిజ్రాలు

గృహ ప్రవేశం రోజు యజమానిని హిజ్రాలు డబ్బుల కోసం బెదిరించడమే కాకుండా, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన చీర్యాలలోని బాలాజీఎన్‌క్లేవ్‌లో జరిగింది. సదానందం నూతన ఇంటికి వచ్చిన హిజ్రాలు రూ.లక్ష ఇవ్వాలని డిమాండ్ చేశారు. యజమాని నిరాకరించగా మరో 15 మందిని వెంట పెట్టుకొచ్చి కుటుంబ సభ్యులను విచక్షణారహితంగా కొట్టారు. ఈ ఘటనలో సదానందం తలకు గాయాలు అయ్యాయి. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Similar News
News November 11, 2025
BREAKING: జవహర్‌నగర్ డంపింగ్ యార్డుపై NGT కీలక ఆదేశాలు

కొన్నేళ్లుగా గ్రేటర్ HYDలోని చెత్తనంతా జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు తరలిస్తున్న విషయం తెలిసిందే. కాగా జవహర్‌నగర్ డంపింగ్ యార్డుకు కొత్త వ్యర్థాలను పంపడం ఆపాలని GHMCని NGT ఆదేశించింది. ఇప్పటికే అక్కడ ఉన్న భారీ కుప్పల ప్రాసెసింగ్‌ను మాత్రమే అనుమతించింది. తాజాగా ఉత్పన్నమయ్యే ఇంధనం (RDF) వ్యర్థాలు ఆ ప్రదేశంలోకి ప్రవేశించకూడదని, పర్యావరణాన్ని కాపాడేందుకు GHMC చర్యలు తీసుకోవాలని NGT ఆదేశించింది.
News November 11, 2025
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక: MLAలు, మాజీ MLAలపై కేసు నమోదు

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘనలపై హైదరాబాద్ సిటీ పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. మధురానగర్ PSలో ఎమ్మెల్యేలు బీర్ల ఐలయ్య, రామచంద్రనాయక్, రాందాస్‌పై రెండు కేసులు ఫైల్ అయ్యాయి. బోరబండ PSలో మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, మెతుకు ఆనంద్‌పై ఓ కేసు నమోదైంది. కోడ్ ఉల్లంఘనపై కఠిన చర్యలు కొనసాగుతాయని, ప్రజాస్వామ్యంగా ఎన్నికలు సాగాలంటే ప్రతి ఒక్కరూ నియమాలను గౌరవించాలని సిటీ పోలీసులు విజ్ఞప్తి చేశారు.
News November 11, 2025
BREAKING: HYD: మాగంటి సునీతపై కాంగ్రెస్ ఫిర్యాదు

BRS అభ్యర్థి మాగంటి సునీతపై ఎలక్షన్ కమిషన్‌కి కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. ప్రెస్‌మీట్‌పై కాంగ్రెస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. మాగంటి సునీత ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారంటూ ఫిర్యాదు చేసింది. ఎన్నిక జరుగుతుండగానే ప్రెస్‌మీట్ పెట్టారని పేర్కొంది. ప్రెస్‌మీట్ నిర్వహించొద్దని,ఒకవేళ నిర్వహిస్తే ఓటర్లను ప్రభావితం చేయడమే అవుతుందని ఇప్పటికే ECI స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసిందని తెలిపింది.


