News November 13, 2025

HYD: గెట్ రెడీ.. రేపే కౌంటింగ్

image

రేపు యూసుఫ్‌గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంకానుంది. సెగ్మెంట్‌లో 4,01,365 ఓటర్లు ఉన్నారు. ఇందులో 1,94,631(48.49%) మాత్రమే ఓటు వేశారు. 10 రౌండ్లు, 42 టేబుళ్ల మీద కౌంటింగ్ ఉంటుంది. షేక్‌పేటలోని 1వ బూత్‌తో మొదలై ఎర్రగడ్డలోని 407 బూత్‌తో కౌంటింగ్ ముగియనుంది. సీసీ కెమెరాల నిఘాలో ఈ ప్రక్రియ జరగనుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు జూబ్లీహిల్స్ MLA ఎవరో తేలనుంది.

Similar News

News November 13, 2025

మెదక్: చలి చంపేస్తోంది బాబోయ్!

image

ఉమ్మడి మెదక్‌ జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెల్లవారుజామున పనిచేసే పారిశుధ్య కార్మికులు, పాల, కూరగాయల వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు, ఆస్తమా రోగులు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని జిల్లా వైద్యులు సూచించారు.

News November 13, 2025

ఢిల్లీ పేలుడు.. కారులో డీఎన్ఏ ఉమర్‌దే!

image

ఢిల్లీలోని ఎర్రకోట వద్ద కారు బ్లాస్ట్‌లో మరణించింది డాక్టర్ ఉమర్ అని అధికార వర్గాలు తెలిపాయని INDIA TODAY పేర్కొంది. కారులోని డీఎన్ఏ, ఉమర్ కుటుంబ సభ్యులతో సరిపోలిందని వెల్లడించింది. i20 కారుతో ఎర్రకోట సిగ్నల్ వద్ద ఆత్మహుతి దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 12 మంది మరణించారు. కాగా ఉమర్ పేరిట ఉన్న మరో కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

News November 13, 2025

HYD: స్పాలో అమ్మాయిలతో అబ్బాయిలకు మసాజ్

image

డిఫెన్స్‌ కాలనీలో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న జెనోరా స్పా మసాజ్ సెంటర్‌పై నేరేడ్‌మెట్ పోలీసులు దాడులు చేశారు. ఈ స్పాలో నిబంధనలకు విరుద్ధంగా మహిళా థెరపిస్ట్‌లతో పురుషులకు క్రాస్ మసాజ్‌లు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. స్పా యజమాని, మేనేజర్‌పై కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. అవసరమైన అనుమతులు లేకుండా నడిపినందుకు సంబంధిత పత్రాలు, సీసీ ఫుటేజ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.