News September 13, 2025
HYD: గెస్ట్ లెక్చరర్లకు గుడ్ న్యూస్.. విధుల్లో కొనసాగింపు

గవర్నమెంట్ జూనియర్ కళాశాలల్లో పనిచేస్తున్న గెస్ట్ లెక్చరర్లకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వీరిని ఈ విద్యాసంవత్సరానికి కూడా కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైదరాబాద్ నగరంతోపాటు వివిధ జిల్లాల్లో దాదాపు 970 మంది గెస్ట్ లెక్చరర్లు పనిచేస్తున్నారు. వీరంతా వచ్చే సంవత్సరం మార్చి 31వ తేదీ వరకు విధుల్లో ఉంటారు.
Similar News
News September 13, 2025
HYD: మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క లొంగుబాటు

మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క ఈరోజు HYDలో పోలీసులు ఎదుట లొంగిపొయింది. మావోయిస్టు సెంట్రల్ కమిటీ మెంబర్‌గా సుజాతక్క ఉన్నారు. గద్వాల్‌కు చెందిన సుజాతక్క అలియాస్ పోతుల కల్పన 1984లో కిషన్‌జీని వివాహం చేసుకుంది. మొత్తం 106 కేసుల్లో సుజాతక్క నిందితురాలిగా ఉంది. మావోయిస్టులు ఎవరైనా లొంగిపోవచ్చని డీజీపీ జితేందర్ సూచించారు.
News September 13, 2025
HYD: అందరూ ఈ 9000113667 నంబర్ సేవ్ చేసుకోండి..!

గ్రేటర్ HYDలో మూతలేని మ్యాన్ హోళ్లు చాలా చోట్ల మీకు కనిపిస్తాయి. అందులో ఎవరైనా పడి ప్రమాదాలకు గురి కావచ్చు. అందుకే మూతలేని మ్యాన్ హోల్‌ను మీరు చూస్తే వెంటనే 9000113667 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారమివ్వండి. హైడ్రా అధికారులు తక్షణం స్పందించి దానికి మూతను ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటారు. ఈ విషయం మీ మిత్రులు, సన్నిహితులకు కూడా షేర్ చేయండి. SHARE IT
News September 13, 2025
HYD: స్పోర్ట్స్ కాంప్లెక్సుల నిర్వహణ నుంచి తప్పుకుంటున్న GHMC!

నగరంలో చాలా చోట్ల GHMCకి స్పోర్ట్స్ కాంప్లెక్సులు ఉన్నాయి. అయితే వాటి నిర్వహణ భారంగా అనిపించిందో, లేక ఆదాయం పొందాలని అనుకుంటోందో తెలియదు కాని మెయింటెనెన్స్ నుంచి తప్పుకుంటోందని తెలుస్తోంది. సిటీలో ఉన్న పలు స్పోర్ట్స్ కాంప్లెక్సులను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు నడుం బిగించింది. రెండేళ్లపాటు వాటిని ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు కూడా పిలిచింది. మొదటి దశలో 9 కాంప్లెక్సులను అప్పగించనుంది.