News November 16, 2025

HYD: గోల్డెన్ అవర్ మిస్ అయితే గండమే!

image

ప్రమాదం జరిగిన మొదటి 60 నిమిషాలను గోల్డెన్ హవర్ అని అంటాం. ప్రమాదం జరిగిన గంటలోపు క్షతగాత్రుడికి వైద్యం అందిస్తే ప్రాణాలు దక్కే అవకాశం 90శాతానికిపైగా ఉంటుందని HYD డా.రవి ప్రకాష్ తెలిపారు. బ్రెయిన్ స్ట్రోక్ జరిగిన సమయంలో తొలి 4 గంటలలోపు గోల్డెన్ అవర్గా భావిస్తారు. అయితే తొలి గంటలో వైద్యం 30% మందికి అందక అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారు. SAVE THE LIFE

Similar News

News November 16, 2025

మెట్‌పల్లి: ‘ఓపెన్ డిగ్రీ విద్యార్థులూ రెగ్యులర్ క్లాసులకు రావచ్చు’

image

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ అడ్మిషన్స్ పొందిన విద్యార్థులు మెట్‌పల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో రెగ్యులర్‌గా జరుగుతున్న డిగ్రీ తరగతులకు సైతం హాజరుకావచ్చని ప్రిన్సిపల్ డాక్టర్ కే.వెంకయ్య తెలిపారు. కాగా, కళాశాలలో ఉన్న అంబేడ్కర్ ఓపెన్ డిగ్రీ అధ్యయన కేంద్రంలో అడ్మిషన్ పొందిన విద్యార్థులకు ఆదివారం క్లాసులు ప్రారంభించారు. కో-ఆర్డినేటర్ రాజేందర్, దశరథం, గంగాధర్ తదితరులున్నారు.

News November 16, 2025

సేవింగ్స్ అకౌంట్లో ఈ లిమిట్ దాటితే ఐటీ నిఘా ఖాయం!

image

బ్యాంకు ట్రాన్సాక్షన్ పరిమితులు తెలియకుండా భారీగా లావాదేవీలు చేస్తే IT నిఘా ఖాయమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒక FYలో సేవింగ్స్ ఖాతాలో ₹10 లక్షలు, కరెంట్ ఖాతాలో ₹50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించితే ITకి రిపోర్ట్ చేయాలి. FD ₹10 లక్షలు, ఒక వ్యక్తి నుంచి నగదు రూపంలో ₹2 లక్షల వరకు మాత్రమే పొందవచ్చు. ప్రాపర్టీ కొనుగోలు టైమ్‌లో ₹30 లక్షలు, క్రెడిట్ కార్డు బిల్లు ₹10 లక్షల పరిమితిని దాటకూడదు.

News November 16, 2025

HYD: డ్రంక్ అండ్ డ్రైవ్‌ తనిఖీల్లో దొరిపోయారు!

image

సైబరాబాద్ CP అవినాష్ మహంతి ఆదేశాల మేరకు ట్రాఫిక్ పోలీసులు వీకెండ్‌లో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఇందులో భాగంగా 468 కేసులు నమోదు చేశారు. 335 బైక్‌లు, 25 త్రీ వీలర్స్, 107 ఫోర్ వీలర్స్, ఒక హెవీ వెహికల్‌పైన కేసు నమోదు చేశామన్నారు. 51-100 BAC కౌంట్‌లో అత్యధికంగా 197 మంది మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడ్డారని పోలీసులు వెల్లడించారు.