News March 29, 2024
HYD: గ్రీన్ హైడ్రోజన్ తయారీపై ప్రయోగాలు
HYD తార్నాకలోని IICT గ్రీన్ హైడ్రోజన్ తయారీపై ప్రయోగాలు చేస్తుంది. శిలాజ ఇంధనాల వినియోగం నియంత్రించడంపై దృష్టి సారించింది. క్లీన్ ఎనర్జీగా హైడ్రోజన్‌కు పేరున్న నేపథ్యంలో కోబాల్ట్ టెర్పరిడిన్ రసాయన మూలకాన్ని ఉపయోగించి వాణిజ్యపరంగా గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి చేసేందుకు పరిశోధనలు చేస్తున్నట్లు తెలిపారు.
Similar News
News November 24, 2024
HYDలో బీసీ కమిషన్ బహిరంగ విచారణ పూర్తి
HYD కలెక్టరేట్‌లో బీసీ కమిషన్ బహిరంగ విచారణ పూర్తయింది. రాష్ట్రంలోని వివిధ వర్గాల ప్రజలు, ప్రజా ప్రతినిధుల నుంచి రిజర్వేషన్లు కల్పించే అంశంపై వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. పలు సామాజిక వర్గాలకు చెందిన వారు, వినతి పత్రాలు సైతం అందించినట్లుగా HYD కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి తెలిపారు.
News November 24, 2024
కోటి దీపోత్సవంలో పాల్గొన్న మంత్రి దంపతులు
HYDలోని ఎన్టీఆర్ స్టేడియంలో కొనసాగుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. కోటి దీపోత్సవాన్ని కార్తికమాసం వేళ అద్భుతంగా నిర్వహించడంతో మంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఆధ్యాత్మికత ఉట్టిపడుతుందని పేర్కొన్నారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
News November 24, 2024
ఓయూలో రాజకీయ సభలకు అనుమతివ్వొద్దు: BRSV
ఓయూలో ఎలాంటి రాజకీయ సభలకు అనుమతి ఇవ్వకూడదని BRSV రాష్ట్ర కార్యదర్శి నాగారం ప్రశాంత్ అన్నారు. శనివారం ఓయూ ఉపకులపతి కుమార్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. శాంతియుతంగా ఉన్న ఓయూలో రాజకీయ సభలు పెట్టి యూనివర్సిటీ ప్రతిష్ఠను దెబ్బతీయడానికి కాంగ్రెస్ చూస్తుందన్నారు. నూతన విద్యార్థులకు గ్రూప్ పరీక్షలు జరిగే సమయంలో ఇలాంటి సభలకు అనుమతి ఇవ్వకూడదన్నారు.