News October 17, 2024
HYD: గ్రూప్-1 అభ్యర్థులతో గాంధీభవన్‌లో చర్చ

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కలిసేందుకు గ్రూప్-1 అభ్యర్థులు అపాయింట్‌మెంట్ కోరారు. వారి విజ్ఞప్తి మేరకు కలిసేందుకు ఆయన సమయం ఇచ్చారు. గాంధీ భవన్ ముట్టడికి వచ్చిన అభ్యర్థులను పోలీసులు అరెస్టు చేయగా.. వారిని వెంటనే విడుదల చేయాలని ఆయన ఆదేశించారు. నేడు గాంధీ భవన్‌లో గ్రూప్-1 అభ్యర్థులతో చర్చించనున్నారు.
Similar News
News November 4, 2025
జూబ్లీహిల్స్‌లో HOME VOTING

జూబ్లీహిల్స్‌లో EC ఇంటి ఓటింగ్‌ను ప్రారంభించింది. వృద్ధులు, శారీరకంగా వికలాంగులైన ఓటర్లు ఇంటి ఓటింగ్‌లో తమ ఓటు హక్కును వినియోగించుకుంటారు. 85 ఏళ్లు పైబడిన 84 మంది ఓటర్లు, 40 శాతం శారీరకంగా వికలాంగులైన 19 మంది ఓటెస్తారు. ఓటింగ్ సమయం ఉదయం 9 గంటల నుంచి సా. 5 గంటల వరకు ఉంటుంది. అధికారులు వారి ఇళ్లకు వెళ్లి ఓటు వేయడానికి సహాయం చేస్తారు. నవంబర్ 6న కూడా వారు తమ ఇంటి నుంచే ఓటు వేయడానికి అనుమతిస్తారు.
News November 4, 2025
HYD: BANKలో JOBS.. రెండ్రోజులే ఛాన్స్

తెలంగాణ స్టేట్ కో-ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్(TGCAB)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ గడువు ఎల్లుండితో ముగుస్తుంది. HYDలో 32 స్టాఫ్ అసిస్టెంట్‌లు అవసరముంది. అర్హత: గుర్తింపు పొందిన వర్సిటీ నుంచి డిగ్రీ ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 30 మధ్య ఉండాలి. ఆన్‌లైన్ ఎగ్జామ్, సర్టిఫికెట్ వెరిఫికేషన్ ద్వారా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. మరిన్ని వివరాలకు ‘https://tgcab.bank.in/’లో చెక్ చేసుకోండి.
SHARE IT
News November 4, 2025
HYD: హైవే బలి తీసుకుంది!

ఆలస్యం అమృతం విషం.. HYD-బీజాపూర్ హైవేకు ఈ సామెత సరిపోతుంది. 2022లో శంకుస్థాపన చేసిన పనులు రెండ్రోజుల క్రితం ప్రారంభమవడం గమనార్హం. ఇందుకు చాలా కారణాలే ఉన్నాయి. పర్యావరణం దెబ్బతింటోందని గతంలో NGTకి పిటిషన్ రాగా.. సుధీర్ఘ విచారణ అనంతరం గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఈలోపు జరగాల్సిన అనార్థాలు జరిగాయి. నిన్న మీర్జాగూడ యాక్సిడెంట్ ఇందులో భాగమైంది. కానీ, ఐదేళ్లలో ఈదారిలో 200 మందికిపైగా చనిపోవడం ఆందోళనకరం.


