News September 2, 2025

HYD: గ్రేటర్‌లో అత్యధిక వర్షపాతం

image

గ్రేటర్‌లో ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు సాధారణం కంటే అధికంగా 31.3% వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. మహానగరం పరిధిలోని మొత్తం 29 మండలాల్లో జూన్-1 నుంచి సెప్టెంబర్-1 వరకు సాధారణంగా 407.7 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా.. 617.8 MM వర్షపాతం నమోదైంది. సాధారణం కంటే అత్యధికంగా అమీర్‌పేట, ఖైరతాబాద్‌లలో 56%, శేరిలింగంపల్లిలో 54% నమోదైంది.

Similar News

News September 2, 2025

ఈ నంబర్ మీ కోసమే: ఆళ్లగడ్డ ఎమ్మెల్యే

image

ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. నియోజకవర్గ ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకోవడానికి 99933 39350 అనే వాట్సాప్ నంబర్‌ను మంగళవారం లాంచ్ చేశారు. ‘మీ సమస్య ఏదైనా పై నంబరుకు ఫోన్ కాల్, మెసేజ్, వాట్సాప్ ద్వారా తెలియజేయవచ్చు. సమస్యలను నేను పరిష్కరిస్తా’ అని తెలిపారు. ప్రజల కోసమే వాట్సాప్ గవర్నెన్స్ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.

News September 2, 2025

చిత్తూరు: దోమల నియంత్రణకు చర్యలు ఏవీ..!

image

వాతావరణ మార్పుతో పాటు దోమలు ఎక్కువైపోయాయి. అటు పంచాయతీలు..ఇటు పట్టణాలు రెండు వైపులా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో జ్వరాలతో ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. దోమల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెబుతున్న అధికారులు ఫాగింగ్ చేసే పరిస్థితి కూడా లేదు. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు చిన్నపాటి క్లినిక్లు కూడా రోగులతో నిండిపోయాయి. ఆరోగ్య శాఖ ప్రకటనలు కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

News September 2, 2025

వినాయక నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ

image

కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా SP రాజేష్ చంద్ర కామారెడ్డి టేక్రియాల్ చెరువు వద్ద గణేష్ నిమజ్జనాల ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు. నిమజ్జనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా, అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలను నివారించడానికి గజ ఈతగాళ్ళు, రెస్క్యూ టీమ్‌లను సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. వెంట ASP చైతన్య రెడ్డి ఉన్నారు.