News April 7, 2025
HYD: గ్రేటర్లో కల్తీరాయుళ్లకు ఇక తప్పవు కష్టాలు

మహానగరంలోని హోటళ్లలో ఎక్కడ చూసినా కల్తీ ఆహారమే దర్శనమిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల సిటీలో అనేక చోట్ల అధికారుల తనిఖీల్లో ఈ విషయం వెల్లడైంది. దీంతో నగరంలో ఆరు ఆహార పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయాలని GHMC నిర్ణయించింది. వీటి ఏర్పాటు కోసం రూ.30 కోట్ల నిధులు (ఒక్కో కేంద్రానికి రూ.6 కోట్లు) కావాలని ఫుడ్ సేఫ్టీ విభాగం అధికారులు నివేదికలు పంపారు. నిధులు విడుదలైతే ఫుడ్ టెస్టింగ్ సిటీలో జోరందుకుంటుంది.
Similar News
News April 9, 2025
హుస్సేన్ సాగర్లో యువతిని కాపాడిన హైడ్రా బృందం

కుటుంబ కలహాల కారణంగా హైదరాబాద్ హుస్సేన్ సాగర్లోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసిన మెర్రీ అనే 36 ఏళ్ల మహిళను హైడ్రా DRF బృందం సకాలంలో కాపాడింది. బాలానగర్‌కు చెందిన ఆమెను గమనించిన స్థానికులు హైడ్రాకు సమాచారం అందించగా, DRF సిబ్బంది తాళ్ల సహాయంతో ఆమెను సురక్షితంగా రక్షించారు. అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు.
News April 9, 2025
HYD: MMTS మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు

HYDలోని నాలుగైదు MMTS ట్రెన్లలోనే సీసీ కెమెరాలు ఉన్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మహిళల భద్రత కోసం త్వరలో అన్ని MMTS ట్రెయిన్లలోని మహిళా బోగీల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే MMTS స్టేషన్లలో కూడా కెమెరాల ఏర్పాటుపై దక్షిణ మధ్య రైల్వే అధికారులు, రైల్వే పోలీసులు పరిశీలిస్తున్నారు.
News April 8, 2025
దాది రతన్ మృతి పట్ల సీఎం సంతాపం

బ్రహ్మకుమారీల దాది రతన్ మోహిని జీ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. దాది మోహిని గ్లోబల్ సెంటర్ల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ హెడ్ అని, దాది జీవితం ఆదర్శప్రాయమన్నారు. దాది మృతి రాష్ట్ర, దేశ, విశ్వ ఆధ్యాత్మికతకు తీరనిలోటని సీఎం పేర్కొన్నారు.