News March 26, 2025

HYD: గ్రేట్.. చనిపోతూ ఏడుగురిని కాపాడాడు!

image

తాను చనిపోతూ ఏడుగురికి ప్రాణం పోశాడు ఓ యువకుడు. ఎల్బీనగర్‌లో నివాసం ఉండే శ్రీ అశ్లేశ్ గురునానక్ కాలేజీ‌లో బీటెక్ ఫైనల్ ఇయర్ చేస్తున్నాడు. మైగ్రేన్, ఫిట్స్‌తో మార్చి 21 అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. సికింద్రాబాద్ కిమ్స్‌కు తరలించగా మార్చి 23న అతడి బ్రెయిన్ డెడ్ అయ్యింది. తల్లిదండ్రులు శివశంకర్, ప్రమీల రాణి కుమారుడి అవయవదానానికి ఒప్పుకున్నారు. దీంతో జీవన్‌దాన్ ద్వారా ఏడుగురి ప్రాణాలు కాపాడారు.

Similar News

News November 5, 2025

గోదావరిఖని: అక్టోబర్‌ నెలలో షీటీంకు 69 ఫిర్యాదులు

image

రామగుండం కమిషనరేట్‌ పరిధిలో అక్టోబర్‌ నెలలో మొత్తం 69 ఫిర్యాదులు వచ్చాయని సీపీ అంబర్‌ కిషోర్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎవరైనా వేధింపులకు గురి చేస్తే మహిళలు, విద్యార్థినులు షీ టీమ్స్‌ నంబర్లు 6303923700 (కమిషనరేట్‌), 8712659386 (పెద్దపల్లి), 8712659386 (మంచిర్యాల)ను సంప్రదించాలన్నారు. మహిళల రక్షణ కోసం షీ టీమ్స్‌ ఎల్లప్పుడూ పని చేస్తాయని తెలిపారు.

News November 5, 2025

శ్రీశైలంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు: ఎస్పీ

image

శ్రీశైలంలో మరి కాసేపట్లో ప్రారంభం కానున్న జ్వాలాతోరణం కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు ఎస్పీ సునీల్ షెరాన్ అన్నారు. ఆయన గుడి పరిసరాలు, నంది మండపం తదితర ప్రాంతాలను పరిశీలించారు. విధులు నిర్వహించే సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సూచించారు.

News November 5, 2025

NTR: గురుకుల విద్యార్థులకు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్‌

image

ఇంటర్ చదివి, నీట్ పరీక్ష రాసిన ఏపీఎస్‌డబ్ల్యూఆర్‌, ఏపీటీడబ్ల్యూఆర్‌ గురుకులాల విద్యార్థులకు లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని NTR జిల్లా DCO ఎ. మురళీకృష్ణ తెలిపారు. విజయవాడ అంబేడ్కర్ స్టడీ సర్కిల్‌లో ఉచిత వసతి, భోజన సదుపాయాలతో సబ్జెక్టు నిపుణుల ద్వారా శిక్షణ తరగతులు ప్రారంభమయ్యాయని, అర్హులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.