News December 9, 2025
HYD: గ్రేట్.. 9 మందికి ప్రాణం పోశారు!

మేడ్చల్ జిల్లా పీర్జాదిగూడకు చెందిన ముత్తులూరు కృష్ణకుమారి (58), నల్గొండ రైతు పల్లపు ప్రశాంత్ (27) బ్రెయిన్ డెడ్ కావడంతో వారి కుటుంబాలు అవయవదానానికి ముందుకొచ్చాయి. ఈ మహోన్నత నిర్ణయం ద్వారా కిడ్నీలు, లివర్, గుండె, కళ్లను సేకరించి 9 మందికి ప్రాణం పోశారు. తమ బాధను పక్కన పెట్టి చూపిన వీరి త్యాగం అందరికీ స్ఫూర్తినిచ్చింది. అవయవదానం చేద్దాం.. ఆపదలో ఉన్నవారికి ఊపిరిపోద్దాం.
Similar News
News December 12, 2025
హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి: CBN

AP: అత్యంత హ్యాపెనింగ్ సిటీగా విశాఖ అభివృద్ధి చెందుతుందని CM CBN ఆకాంక్షించారు. తూర్పునావికాదళ కేంద్రంగా, టూరిజమ్ హబ్‌గా ఉన్న విశాఖ ఇప్పుడు ఐటీ, ఏఐ, టెక్నాలజీ, నాలెడ్జ్ సిటీగా మారుతోందని అభివర్ణించారు. కాగ్నిజెంట్ సహా 8 సంస్థలకు భూమి పూజచేశామని, ఏడాదిలో 25వేల మందికి అవకాశాలు వచ్చి ఇక్కడినుంచి పనిచేయగలుగుతారని చెప్పారు. ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభం కానుందని, మెట్రో కూడా వస్తుందని చెప్పారు.
News December 12, 2025
విశాఖను మరో స్థాయికి తీసుకెళ్తాం: చంద్రబాబు

విశాఖ లాంటి బ్యూటిఫుల్ సిటీ దేశంలో ఎక్కడా లేదని సీఎం చంద్రబాబు అన్నారు. పర్యాటకంగా, పారిశ్రామికంగా అభివృద్ధి చెందగలిగే అద్భుతమైన సిటీ అని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని మరోస్థాయికి తీసుకెళ్తామన్నారు. వచ్చే ఏడాదిలో 25 వేల మంది పనిచేసే సంస్థగా కాగ్నిజెంట్ మారుతుందని అన్నారు. నాలెడ్జ్ ఎకానమీ, టెక్నాలజీకి విశాఖ కేంద్రమవుతుందని చెప్పారు. త్వరలో భోగాపురం ఎయిర్ పోర్టు, విశాఖ మెట్రో వస్తుందని పేర్కొన్నారు.
News December 12, 2025
సిరిసిల్ల: పంచాయతీ ఎన్నికల్లో ఎంపీపీలకు మిశ్రమ ఫలితాలు

జిల్లాలో తొలి విడత పంచాయతీ ఎన్నికలలో పోటీ చేసిన మాజీ ఎంపీపీలకు మిశ్రమ ఫలితాలు లభించాయి. వేములవాడ రూరల్ మండలం వట్టెంల నుంచి పోటీ చేసిన మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్ విజయం సాధించగా, హనుమాజీపేటలో కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్, మాజీ ఎంపీపీ తీగల రవీందర్ గౌడ్, చందుర్తిలో మాజీ ఎంపీపీ చిలుక పెంటయ్య, రుద్రంగిలో మాజీ ఎంపీపీ గంగం స్వరూప ఓటమి పాలయ్యారు.


