News November 30, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్‌లో అద్భుత డ్రోన్ షో.. రికార్డు బద్దలు

వేలకొద్దీ డ్రోన్లు.. విచిత్ర విన్యాసాలు.. అక్షరాలుగా కూర్పు.. ఇవన్నీ గ్లోబల్ సమ్మిట్ వేడుకల్లో కనువిందు చేయనున్నాయి. 3వేల డ్రోన్లను ఉపయోగించి ఆకాశంలో ‘‘తెలంగాణ ఎస్ రైజింగ్ కం జాయిన్ ది రైజ్’’ అనే వాక్యాన్ని రూపొందించనున్నారు. ఇంత పెద్ద వాక్యం ఇంతవరకు డ్రోన్లతో ఎక్కడా ప్రదర్శించలేదు. 2025లో అబుదాబిలో 2,131 డ్రోన్లను ఉపయోగించి HAPPY NEW YEARను ప్రదర్శించారు. ఇపుడు ఆ రికార్డును బద్దలుకొట్టనున్నారు.
Similar News
News April 3, 2026
పార్వతీపురం: చిన్నారిపై వీధి కుక్క దాడి.. తీవ్ర గాయాలు (VIDEO)

గరుగుబిల్లి మండలం నాగురులో చిన్నారిపై కుక్కలు దాడి చేసిన ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. చర్చి బయట ఆడుకుంటున్న లిఖిత షేన్ (2)పై వీధి కుక్క ఆకస్మికంగా దాడి చేసింది. తల్లిదండ్రులు చర్చిలో ప్రార్థనలో ఉండగా ఈ ఘటన జరిగింది. కుక్క దాడిలో చిన్నారికి తల భాగంలో తీవ్ర గాయాలు అయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు చిన్నారిని పార్వతీపురం జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు.
News April 3, 2026
HYD: రూ.500 కోట్ల ఫీజులు నిలిచిపోయి సామాన్యుల తిప్పలు!

HYD శివారులోని 74 గ్రామ పంచాయతీల పరిధిలో హెచ్ఎండీఏ (HMDA), కొత్తగా ఏర్పాటైన ఎఫ్‌సీడీఏ (FCDA) మధ్య తీవ్ర అధికార పోరు సాగుతోంది. లేఅవుట్ పర్మిషన్లు, డెవలప్‌మెంట్ ఫీజుల రూపంలో వచ్చే సుమారు రూ.500 కోట్ల ఆదాయం ఎవరికి చెందాలనే దానిపై స్పష్టత లేక ఫైళ్లు పెండింగ్‌లో పడ్డాయి. రెండు సంస్థల జోక్యంతో న్యాయపరమైన చిక్కులు వస్తుండటంతో అటు పర్మిషన్లు రాక సామాన్యులు, ఇటు ఆదాయం లేక ఖజానా నష్టపోతున్నాయి.
News April 3, 2026
KNR: కొత్త పెన్షన్ చెల్లింపు విధానం..!

2026-2027 కొత్త ఆర్థిక సంవత్సరంలో పదవీ విరమణ పొందిన ప్రభుత్వ ఉద్యోగులకు పింఛన్లు చెల్లించడంలో TG GOVT E-PPO (ఎలక్ట్రిక్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్) అనే ఓ కొత్త విధానాన్ని 2 నెలల్లో ప్రవేశపెట్టనుంది. తద్వారా పెన్షన్‌దారులు ఆఫీస్‌కు వెళ్లకుండా తమ వివరాలను నేరుగా అప్‌డేట్ చేసుకోవడం, 12 నంబర్లతో ఉన్న ఒక కోడ్ ద్వారా ప్రతి నెల పెన్షన్ పొందడం, మరణించిన వారి చెల్లింపులు తక్షణం నిలిపివేయడానికి సహాయపడుతుంది.


