News August 4, 2024

HYD: చదువుకుంటూనే నాలుగు ఉద్యోగాలు సాధించిన తులసి

image

ఉస్మానియా యూనివర్సిటీలో ఎంటెక్ చదువుతూ నల్లగొండకు చెందిన చింతల తులసి ఏకంగా 4 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రభంజనం సృష్టించింది. తాజాగా వచ్చిన ఫలితాల్లో AEE, AE, గ్రూప్-4, పాలిటెక్నిక్ లెక్చరర్ ఉద్యోగాలు సాధించింది. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలోనే విద్యను అభ్యసించిన తులసి.. ప్రభుత్వ ఉద్యోగమే ధ్యేయంగా గత రెండు సంవత్సరాలుగా పరీక్షలకు సన్నద్ధమవుతూ నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికైంది.

Similar News

News November 11, 2025

అన్ని దేశాల టెకీలకు స్వర్గధామం మన HYD

image

చైనా, జపాన్, రష్యా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, న్యూజిలాండ్, యునైటెడ్ కింగ్డమ్ సహా అనేక దేశాల టెకీలకు అనువైన ప్రాంతాల జాబితాలో HYD నిలిచింది. ఇతర దేశాల టెక్నికల్ ఇంజినీర్లు సైతం HYDకి ట్రాన్స్‌ఫర్ పెట్టుకుని, అద్భుతమైన వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నట్లుగా UK టీకి అశ్విన్‌రాజ పవన్ తెలిపారు. ఇతర దేశాలతో పోల్చితే HYDలో తక్కువ ఖర్చుతో, ఆనందంగా బతకడం చాలా ఈజీ అని చెప్పుకొచ్చారు.

News November 11, 2025

జూబ్లీహిల్స్ బైపోల్: 1PM UPDATE.. 31.94% పోలింగ్ నమోదు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94% పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్‌లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. 2023 సాధారణ ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం అధికంగా నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఓటు వేయని వారు ఉంటే మీ అమూల్యమైన హక్కును వినియోగించుకోండి.

News November 11, 2025

జూబ్లీహిల్స్ బైపోల్‌: ‘నేను ఓటు వేశాను.. మరి మీరు?’

image

జూబ్లీహిల్స్ బైపోల్‌లో ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. యూసుఫ్‌గూడలోని పలు పోలింగ్ బూత్‌లలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం బయటకు వచ్చి ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘నేను ఓటు వేశాను.. మరి మీరు’ అంటూ స్నేహితులకు సందేశం పంపుతున్నారు. యువత.. మీరూ కొంచెం ఆలోచించండి. ఓటు వేసి SMలో ఒక పోస్ట్ పెట్టండి. ఇంకా ఓటు వేయనివారిని పోలింగ్‌కు తీసుకెళ్లండి.