News July 27, 2024
HYD: చాక్లెట్‌లో ఈగ.. షాక్

HYD జూబ్లీహిల్స్ పరిధిలోని గ్రీల్స్ అఫైర్స్ నుంచి చాక్లెట్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తి షాక్‌కు గురయ్యారు. ఆర్డర్ ఓపెన్ చేసి చూడగా అందులో ఈగ ఉండడంతో అవాక్కయ్యాడు. యాజమాన్యాన్ని ప్రశ్నించగా నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో వెంటనే జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేయగా.. స్పందించి త్వరలోనే తనిఖీలు చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Similar News
News January 26, 2026
రంగారెడ్డి: కలెక్టరేట్‌లో ఏర్పాట్లు అధ్వానం

రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో గణతంత్ర దినోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. విద్యార్థులు పలు సాంసృతిక కార్యక్రమాలు నిర్వహించారు. వేడుకలను తిలకించేందుకు పెద్ద సంఖ్యలో జనాలు హాజరయ్యారు. కానీ ఏర్పాట్లు మాత్రం అధ్వానంగా ఉన్నాయని వచ్చిన వారు మండిపడుతన్నారు. కూర్చునేందుకు కుర్చీలు లేకపోవడంతో పసిపిల్లలను ఎత్తుకుని ఎండలో నిలబడ్డారు.
News January 25, 2026
HYD: సాగర తీర విగ్రహాల వెనుక దాగిన చరిత్ర

HYD- SECను కలిపే హుస్సేన్‌సాగర్‌కు వెళ్తే వరుసగా కొలువైన 34 మంది మహానీయుల విగ్రహాలపైకి చూపు మళ్లక మానదు. ముందు తరాల వారికి దీని గురించి తెలిసినా.. నేటి తరానికి అదొక ప్రశ్నే. ఈ విగ్రహాలతో వారి గొప్పతనాన్ని చాటి చెప్పేందుకు ఇక్కడ ఏర్పాటు చేశారు. వీరు ఎవరు? అనే సందేహం అందరి మదిలో మెదులుతోంది. ఈ మహనీయుల వీరగాథ, చరిత్ర చెప్పేందుకు Way2News రోజుక్కొక్కరి స్టోరిని సంక్షిప్తంగా అందిస్తుంది.
News January 25, 2026
రంగారెడ్డి: ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు నేడు రంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఘనంగా నిర్వహించనున్నట్లు కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. అన్ని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాలు, మండల కార్యాలయాలు, పోలింగ్ బూత్ స్థాయుల్లో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ వేడుకల్లో ప్రజలు, యువత పెద్దఎత్తున పాల్గొనాలని కలెక్టర్ కోరారు.


