News April 9, 2024
HYD: చావు డప్పు మోగిస్తామని కాంగ్రెస్‌కు హెచ్చరిక
ఈనెల 15 లోగా మాదిగలకు ఎంపీ సీట్లు కేటాయించకపోతే కాంగ్రెస్ కార్యాలయమైన గాంధీభవన్‌తో పాటు అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో చావు డప్పు మోగిస్తామని టీ ఎమ్మార్పీఎస్ చీఫ్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ హెచ్చరించారు. HYD విద్యానగర్‌లోని ఆ సంఘం స్టేట్ ఆఫీస్‌లో సోమవారం ఆయన మాట్లాడారు. తెలంగాణలో అధిక జనాభా కలిగిన మాదిగలకు ఒక్క ఎంపీ సీటు ఇవ్వకుండా కాంగ్రెస్ మాదిగలను అణగదొక్కే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.
Similar News
News January 18, 2025
HYD: సినిమాల్లో ఛాన్స్ పేరుతో లైంగిక దాడి
సినిమాల్లో ఛాన్స్ అంటూ ఇటీవల ఓ మహిళపై లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆడిషన్స్ పేరుతో ఆశ చూపించి గదికి పిలిచి ఓ దుండగుడు అత్యాచారానికి ఒడిగట్టాడని పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు అసిస్టెంట్ డైరెక్టర్ రాజు మీద BNS 64,79,115,351(2) కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నామని జూబ్లీహిల్స్ పోలీసులు వెల్లడించారు.
News January 18, 2025
RR: రైతు భరోసా.. ఈ సారి ఎంత మందికో!
ఉమ్మడి RR జిల్లాలో 6.3 లక్షల మంది రైతులు ఉండగా, గత చివరి సీజన్లో RR జిల్లా పరిధిలో 3.04 లక్షల మంది రైతులకు రూ.343.97 కోట్లు రైతుబంధు కింద రైతుల ఖాతాల్లో జమ చేశారు. వికారాబాద్ జిల్లాలో 2.70 లక్షలమంది రైతులకు రూ.319.36కోట్లు పంపిణీ చేశారు. మేడ్చల్ జిల్లా పరిధిలో 44,792 మంది రైతులకు రూ.39.74కోట్లు రైతులఖాతాల్లో జమ చేశారు. ప్రస్తుతం రైతుభరోసాకు సంబంధించి సర్వే జరుగుతోంది.
News January 18, 2025
RR: రైతు భరోసా సర్వే.. టార్గెట్-20
RR, MDCL, VKB జిల్లాల వ్యాప్తంగా రైతు భరోసా పథకం అమలు చేసేందుకు ప్రభుత్వ వ్యవసాయ, రెవెన్యూ అధికారులు గ్రామ గ్రామాల్లో తిరుగుతూ సర్వే నిర్వహిస్తున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. జనవరి 20 తేదీ నాటికి సర్వేను పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నట్లు పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న దరఖాస్తు దారులను సైతం కలిసి వివరాలు సేకరిస్తున్నారు.