News April 6, 2025
HYD: చికెన్ దుకాణాలు ఖాళీ

మాంసం ప్రియులకు సండే పండగే. ఉదయం చికెన్, మటన్ షాపుల వద్ద క్యూలైన్లు, కిటకిటలాడే గిరాకీ షరామామూలే. కానీ, ఈ ఆదివారం శ్రీ రామ నవమి కావడంతో దృశ్యం పూర్తిగా మారిపోయింది. ప్రతాపసింగారం సహా HYDలోని అనేక మాంసం దుకాణాలు వెలవెలబోయాయి. ఎప్పుడూ జనసంద్రంగా మారే మార్కెట్లు నిర్మానుష్యంగా కనిపించాయి. ఇదే సీన్ గత వారం ఉగాది రోజూ కనిపించింది. పండుగల దెబ్బకు అమ్మకాలు పూర్తిగా తగ్గాయని వ్యాపారస్థులు చెబుతున్నారు.
Similar News
News December 19, 2025
కంగ్టి: నాడు సర్పంచ్‌గా భార్య.. నేడు భర్త!

కంగ్టి మండల కేంద్రంలో భార్య వారసత్వాన్ని భర్త కొనసాగించారు. 2019లో భార్య సర్పంచ్‌గా గెలవగా, 2025 ఎన్నికల్లో భర్త కృష్ణ ముదిరాజ్ సర్పంచ్‌గా ఘనవిజయం సాధించారు. తమ కుటుంబం చేసిన సేవలే తనను గెలిపించాయని, ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని ఆయన తెలిపారు. బీఆర్ఎస్ బలపరిచిన ఆరుగురు వార్డు సభ్యులు కూడా గెలవడంపై సంతోషం వ్యక్తం చేస్తూ, అందరి సహకారంతో గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
News December 19, 2025
మంచి ఆదాయ మార్గం.. రాజశ్రీ కోళ్ల పెంపకం

రాజశ్రీ కోళ్లు అధిక రోగ నిరోధక శక్తిని కలిగి తీవ్రమైన వ్యాధులను సైతం తట్టుకుంటాయి. ఇవి తక్కువ సమయంలో అధిక బరువు పెరుగుతాయి. కేవలం 8 వారాల వయసులోనే 500 గ్రాముల బరువు, 20 వారాల వ్యవధిలో రెండున్నర కిలోల వరకు బరువు పెరుగుతాయి. 160 రోజుల వ్యవధిలో గుడ్లను పెట్టడం ప్రారంభించి ఏడాదికి 160-180 గుడ్లు పెడతాయి. మాంసం, గుడ్లు రెండింటి కోసం పెంచేవాళ్లకు రాజశ్రీ మంచి ఎంపిక అంటున్నారు వెటర్నరీ నిపుణులు.
News December 19, 2025
WGL: బీసీల ప్రభంజనం.. 530 స్థానాలు కైవసం!

ఉమ్మడి వరంగల్ జిల్లా పంచాయతీ ఎన్నికల్లో బీసీ అభ్యర్థులు సత్తా చాటారు. మొత్తం 1,684 పంచాయతీల్లో 200 స్థానాలు బీసీలకు రిజర్వు కాగా, అదనంగా 330 జనరల్ స్థానాల్లోనూ విజయం సాధించి మొత్తం 530 జీపీలను కైవసం చేసుకున్నారు. వరంగల్ జిల్లాలో 122, హనుమకొండలో 102, జనగామలో 117, భూపాలపల్లిలో 111, ములుగులో 27, మహబూబాబాద్‌లో 51 మంది బీసీ సర్పంచులుగా ఎన్నికై రికార్డు సృష్టించారు.


