News April 10, 2025
HYD: చికెన్, మటన్ షాపులు బంద్

గ్రేటర్ హైదరాబాద్ వాసులకు ముఖ్య గమనిక. మాంసం దుకాణాలు నేడు బంద్ చేయాలని GHMC ఉత్వర్వులు జారీ చేసింది. కబేళాలు, రిటైల్ బీఫ్ దుకాణాలు మూసి ఉంటాయని ప్రకటించింది. మహావీర్ జయంతి సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వులు జారీ అయ్యాయి. GHMC లిమిట్స్‌లోని అన్ని మాంసం దుకాణాలకు ఈ ఉత్తర్వులు వర్తిస్తాయి.
SHARE IT
Similar News
News September 17, 2025
వరంగల్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రజా పాలన దినోత్సవ వేడుకలు

వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆఫీస్‌లో తెలంగాణ ప్రజా పాలన దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనరేట్ పరిపాలన భవనం ప్రాంగణంలో పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ షేక్ సలీమా, అదనపు డీసీపీలు రవి, ప్రభాకర్ రావు, సురేశ్ కుమార్, ఏసీపీలు, ఆర్‌ఐలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్‌ఐలతో పాటు వివిధ విభాగాల పోలీస్ అధికారులు పాల్గొన్నారు.
News September 17, 2025
కొడంగల్: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం

కొడంగల్ నియోజకవర్గ తుంకిమెట్ల శివారులో ఘోర ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం యువకుడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దౌల్తాబాద్ మండలం అల్లాపూర్ గ్రామానికి చెందిన కనకప్ప (26) అక్కడికక్కడే మృతిచెందాడు. హైదరాబాద్‌లో డ్రైవర్‌గా పని చేసే కనకప్ప రాత్రి స్వగ్రామానికి వస్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. అన్న ఆశప్ప ఫిర్యాదుతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
News September 17, 2025
నటికి రూ.530 కోట్ల రెమ్యూనరేషన్ ఆఫర్?

హాలీవుడ్ నటి సిడ్నీ స్వీనీకి బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చినట్లు వార్తలొస్తున్నాయి. హయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందనున్న ఓ సినిమాలో నటించేందుకు ఆమెకు ఏకంగా రూ.530కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు సినీవర్గాలు తెలిపాయి. అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకర్షించేందుకు మేకర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన లేదు. ఇది జరిగితే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న నటిగా సిడ్నీ నిలువనున్నారు.