News October 25, 2025

HYD: చిన్నారుల్లో పెరుగుతున్న నిమోనియా.. జర జాగ్రత్త..!

image

HYDలోని NIMS, నీలోఫర్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో చికిత్స కోసం వస్తున్న పిల్లల్లో నిమోనియా కేసులు పెరుగుతున్నట్లు డాక్టర్లు గుర్తించారు. ప్రస్తుత శీతాకాలంలో పిల్లలను బయట వాతావరణానికి, చలికి దూరంగా ఉంచాలని డాక్టర్ ప్రతాప్ సింగ్ సూచించారు. చిన్నారుల్లో రోజు రోజుకు నిమోనియా కేసులు పెరుగుతున్నాయని, క్రిటికల్ కేసులను ICU ప్రత్యేక విభాగంలో వైద్యం అందిస్తున్నామన్నారు. జర జాగ్రత్త! SHARE IT

Similar News

News October 25, 2025

జైళ్ల నుంచి ఉగ్ర, హత్య కుట్రలపై కేంద్రం అప్రమత్తం

image

జైళ్ల నుంచి ఉగ్ర, హత్య కుట్రలు చేస్తున్న టెర్రరిస్టు-గ్యాంగ్‌స్టర్ నెట్వర్క్‌ను విచ్ఛిన్నం చేసేలా ప్రణాళికను రూపొందించాలని అన్ని భద్రతా ఏజెన్సీలకు కేంద్ర హోమ్ శాఖ ఆదేశాలిచ్చింది. ఇటీవల జరిగిన కొన్ని హత్యలపై 53చోట్ల NIA చేసిన సోదాల్లో జైళ్ల నుంచి ఆర్గనైజ్డ్ నెట్వర్కు నడుస్తున్నట్లు తేలడంతో చర్యలు చేపట్టింది. రాష్ట్రాల పోలీసుల సహకారంతో అత్యంత ప్రమాదకారుల్ని గుర్తించి వారిని ఇతర జైళ్లకు తరలించనుంది.

News October 25, 2025

GWL: బీసీ రిజర్వేషన్లపై అఖిలపక్ష కమిటీ సమావేశం

image

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న డిమాండ్‌తో గద్వాల పట్టణంలో రేపు అఖిలపక్ష కమిటీ సమావేశం ఉంటుందని కమిటీ నాయకులు నాగర్ దొడ్డి వెంకట్రాములు శనివారం ప్రకటనలో పేర్కొన్నారు. తెలంగాణ జన సమితి కార్యాలయంలో సాయంత్రం 5:00 జరిగే సమావేశానికి బీసీ సంఘాలు, అఖిలపక్ష కమిటీ నేతలు తప్పక హాజరు కావాలన్నారు. బీసీల రిజర్వేషన్లు సాధనే లక్ష్యంగా భవిష్యత్తు కార్యాచరణ రూపొందించాల్సి ఉంటుందన్నారు.

News October 25, 2025

డేటా భద్రతపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ

image

ఒక దేశం బలం దాని డేటాను నియంత్రించడంలోనే ఉందని సిద్దిపేట పోలీస్ కమిషనర్(సీపీ) విజయ్ కుమార్ అన్నారు. సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ‘సైబర్ భద్రత, సవాళ్లు మరియు దృక్పథాలు’ అనే అంశంపై జరిగిన సదస్సులో మాట్లాడారు. చైనా మినహా అన్ని దేశాల డేటా గూగుల్ వద్ద ఉందని, భారతీయులు ఉచిత డిజిటల్ సేవలకు త్వరగా ఆకర్షితులవుతారని తెలిపారు. డేటా భద్రతపై ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు.