News May 1, 2024
HYD: చిరుత తిరుగుతున్న ప్రాంతాలు ఇవే!

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ ఆవరణలో ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన కెమెరాకు చిరుత చిక్కింది. 4 రోజులుగా శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో చిరుత కోసం ఫారెస్ట్ అధికారులు 25 కెమెరాలు, 5 బోన్లు ఏర్పాటు చేశారు. ఓ బోన్ ముందు చిరుత సంచరిస్తున్న ఫొటోలు లభ్యమయ్యాయి. గొల్లపల్లి, రషీద్‌గూడ, బహదూర్‌గూడ, చిన్న గోల్కొండ ఎయిర్‌పోర్టు ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించారు. బీ కేర్ ఫుల్.
SHARE IT
Similar News
News September 12, 2025
పునర్విభజన చట్టం: HYD- అమరావతికి రైల్వే లైన్

భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి అమరావతి మీదుగా బందర్ పోర్టు వరకు గ్రీన్ ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్ ఏర్పాటు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. GM సంజయ్‌కుమార్ శ్రీవాస్తవ ప్రకటించారు. రాష్ట్ర పునర్విభజన చట్టంలోని హామీ ప్రకారం హైదరాబాద్ నుంచి అమరావతికి ర్యాపిడ్ రైల్ అండ్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును కేంద్రం అమలు చేయాల్సి ఉందని సైతం చెప్పారు.
News September 12, 2025
HYD: విద్యుత్ సమస్యల పరిష్కారానికి వాట్సప్ గ్రూప్

బంజారాహిల్స్ డివిజన్లో విద్యుత్ అధికారులు సమస్య పరిష్కారానికి వినూత్న పద్ధతిని ఎంచుకున్నారు. ఇక్కడ 195 ఫీడర్లుండగా ఆ వినియోగదారులతో కలిపి 195 వాట్సప్ గ్రూపులు ఏర్పాటు చేశారు. ప్రజలు తమ విద్యుత్ సమస్యను గ్రూపులో పోస్టు చేస్తే వెంటనే సిబ్బంది సమస్యను పరిష్కరిస్తారు. గ్రూపుల్లో సిబ్బందితోపాటు 30 మంది అధికారులు కూడా ఉంటారు. వీటితోపాటు 1912 సేవలు కూడా అందుబాటులో ఉన్నాయి.
News September 12, 2025
హైదరాబాద్‌లో అతిపెద్ద ఎగ్జిబిషన్ నవంబర్‌లో

భాగ్యనగరం మరో అంతర్జాతీయ ఈవెంట్‌కు వేదిక కానుంది. దక్షిణాసియాలోనే అతిపెద్ద పౌల్ట్రీ ఎగ్జిబిషన్ నవంబర్ 25 నుంచి జరుగనుంది. 3 రోజుల పాటు జరిగే ఈ ఈవెంట్‌లో వివిధ దేశాలకు చెందిన దాదాపు 500 మంది ఎగ్జిబిటర్లు, 50 వేల మంది సందర్శకులు పాల్గొంటారని పౌల్ట్రీ అసోసియేషన్ నాయకులు ఉదయ్ సింగ్ బయాస్ తెలిపారు. హైటెక్ సిటీలోని నోవాటెల్‌లో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు.