News November 9, 2025

HYD: చివరి రోజు.. అభ్యర్థుల్లో టెన్షన్!

image

జూబ్లీహిల్స్‌ బైపోల్‌ ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. అసలే ఆదివారం సెలవు. అభ్యర్థులు ఉదయాన్నే ఓటర్ల డోర్లు తడుతున్నారు. ఉన్నది ఒక్కటే రోజు.. ఎల్లుండే పోలింగ్.. ఎవరినైనా మిస్ అయ్యామా? అనే అంతర్మథనంలో పడుతున్నారు. తాయిళాలు మొదలుపెట్టి గెలుపు కోసం INC, BRS, BJP సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. సామ, దాన, భేద, దండోపాయాలు ఉపయోగిస్తున్నాయి. ఎంత చేసినా సైలెంట్ ఓటింగ్‌ అభ్యర్థుల్లో టెన్షన్‌ను పెంచుతోంది.

Similar News

News November 9, 2025

వంజంగి మేఘాలకొండను సందర్శించిన కలెక్టర్

image

వంజంగి మేఘాలకొండ అందాలను కలెక్టర్ ఏ.ఎస్.దినేశ్ కుమార్ ఆస్వాదించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో వంజంగి కొండపైకి చేరుకున్నారు. మంచు మేఘాలను చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయ కిరణాలు, మంచు మేఘాల అందాలను వారు తిలకించారు. కాగా వీకేండ్ కావడం, రెండు రోజుల సెలవుతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వంజంగి వచ్చి సందడి చేస్తున్నారు.

News November 9, 2025

GWL: టీబీ డ్యామ్ ఆయకట్టుకు డిసెంబర్ 20 వరకు సాగునీరు

image

కర్ణాటక రాష్ట్రం హోస్పేట్ వద్ద ఉన్న తుంగభద్ర డ్యామ్‌కు నూతన గేట్లు అమర్చేందుకు ఇరిగేషన్ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు టీబీ డ్యామ్ పరిధిలోని ఆయకట్టుకు డిసెంబర్ 20 వరకు మాత్రమే సాగునీరు అందిస్తామని తెలిపారు. రబీలో క్రాప్ హాలిడే ప్రకటించి కొత్త గేట్లు అమర్చుతామని తెలిపారు. విషయాన్ని ఆయకట్టు రైతులు గ్రహించి సహకరించాలన్నారు. ఈ విషయమై 3 రాష్ట్రాల ఇరిగేషన్ అధికారులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

News November 9, 2025

గండేపల్లి: వరి కోత యంత్రానికి విద్యుత్ వైర్లు తగిలి ఇద్దరి మృతి

image

గండేపల్లి మండలం రామయ్యపాలెం శివారున ఆదివారం విషాదం చోటు చేసుకుంది. వరి కోత కోస్తున్న యంత్రానికి విద్యుత్ వైర్లు తగలడంతో యంత్రంపై ఉన్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దీంతో ఆ ప్రాంతంలో ఉన్న రైతులు నివ్వెరపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.