News March 24, 2025
HYD: చీపురు కట్టకు మించిన టెక్నాలజీ లేదే..!

ఎంత కొత్త టెక్నాలజీ వచ్చినా చీపురు కట్ట చేసే పని ఏ టెక్నాలజీ చేయలేదని అనటానికి ఇదే నిదర్శనం. ఉప్పల్ స్టేడియం గ్రౌండ్ క్లీన్ చేయడానికి నిన్న చీపురు కట్ట ఉపయోగించక తప్పలేదు. క్లీనింగ్ యంత్రాలు, వాక్యూమ్ సర్కిలింగ్ మెషిన్లు ఉన్నప్పటికీ చీపురు కట్ట చేసే పని అవి చేయలేకపోయాయి. ఇది మన చీపురు కట్ట స్పెషాలిటీ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. మీరేమంటారు..?
Similar News
News March 26, 2025
ఆళ్లగడ్డ: సమాజ సేవకుడిని మరో పురస్కారం

ఎటువంటి స్వార్థం లేకుండా సంపాదించిన సొమ్ములో సగానికి పైగా సమాజానికి ఖర్చు చేస్తున్న నిస్వార్థ సేవకుడు డాక్టర్ బిజ్జల నగేశ్‌ను మరో పురస్కారం వరించింది. సమాజ సేవను గుర్తించి తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన వెల్ రెడ్ ఫౌండేషన్ సంస్థ ఉత్తమ సామాజిక కార్యకర్తగా గుర్తిస్తూ మహాత్మా గాంధీ నేషనల్ ఫ్రైడ్ అవార్డును అందించింది. దీంతో పాటు ప్రశంస పత్రాన్ని పంపుతూ అభినందనలు తెలిపింది.
News March 26, 2025
ఈనెల 28న ప.గో జిల్లాలో పవన్ పర్యటన

AP: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎల్లుండి పశ్చిమ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. ఆ రోజున ఉదయం మొగల్తూరులో, సాయంత్రం పెనుగొండలో గ్రామ సభలు నిర్వహించనున్నారు. ఆయా గ్రామాలు, అన్ని శాఖల అధికారులతో సమావేశమై గ్రామాలకు కావాల్సిన మౌలిక వసతులు, అభివృద్ధి పనులపై చర్చిస్తారు. పవన్ కళ్యాణ్ కుటుంబ మూలాలు మొగల్తూరులో ఉన్న సంగతి తెలిసిందే.
News March 26, 2025
నేషనల్ కబడ్డీ పోటీలకు MBNR జిల్లావాసి ఎంపిక

34వ నేషనల్ సబ్ జూనియర్ కబడ్డీ పోటీలకు మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండలం తిమ్మాయిపల్లి తండాకు చెందిన జై సురేశ్ ఎంపికయ్యారు. ఈనెల 27వ తేదీ నుంచి 31 తేదీ వరకు బిహార్‌లోని గయాలో నిర్వహించనున్న పోటీలలో సురేష్ పాల్గొననున్నారు. ఈ సందర్భంగా కబడ్డీ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు శాంతికుమార్, జనరల్ సెక్రెటరీ కురుమూర్తి గౌడ్, ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి, దామోదర్ రెడ్డి తదితరులు సురేశ్‌ను అభినందించారు.