News November 6, 2025
HYD: చీమలకు భయపడి వివాహిత సూసైడ్

చీమలకు భయపడి వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన అమీన్‌పూర్‌లో పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నవ్య హోమ్స్‌లో నివసిస్తున్న మనీషా (25) ఫోబియాతో చీమలకు భయపడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మనీషా 2022లో చిందం శ్రీకాంత్(35)ను వివాహం చేసుకుంది. వీరికి కుమార్తె అన్వీ(3) ఉంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
Similar News
News November 6, 2025
వరంగల్ మార్కెట్ సందర్శించిన కలెక్టర్

వరంగల్ కలెక్టర్ డా. సత్యశారదా దేవి గురువారం ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌ని సందర్శించారు. ఆమె మార్కెట్లోని రైతులు, వ్యాపారస్తులతో మాట్లాడి, సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నవంబర్ 5తేదీలోపు తమ సమస్యల పరిష్కరించకపోతే పత్తి కొనుగోలు చేయమని వ్యాపారులు తెలిపిన నేపథ్యంలో వారితో మాట్లాడారు. రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు చేయాలని సూచించారు.
News November 6, 2025
జుట్టుకు మసాజ్ చేస్తున్నారా?

ప్రస్తుతం కాలుష్యం, అనారోగ్యకరమైన జీవనవిధానాల వల్ల చాలామందిలో జుట్టు ఎక్కువగా రాలుతోంది. అలాగే కాలంతో సంబంధం లేకుండా చుండ్రు సమస్య కూడా వేధిస్తుంది. వారానికోసారి హెయిర్ మసాజ్ చేసుకోవడం వల్ల కుదుళ్లకు దృఢత్వాన్ని చేకూర్చడంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకోవచ్చంటున్నారు నిపుణులు. కుదుళ్ల వద్ద చర్మం పొలుసులుగా ఊడిపోవడం, పొడిబారిపోవడం, జుట్టు ప్యాచుల్లా ఊడిపోవడం వంటి వాటికి మసాజ్ చక్కటి పరిష్కారం.
News November 6, 2025
వేములవాడ: రాజన్నను మొక్కాకే ముందుకు..!

దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర ఆలయానికి ఓ ఆనవాయితీ ఉంది. ఏ పుణ్యక్షేత్రానికి వెళ్లాలన్నా ఉత్తర తెలంగాణలోని ప్రజలు ముందుగా రాజన్నను దర్శించుకుంటారు. రాజన్నను దర్శించుకోవడంతో తమ ప్రయాణం ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగుతుందని భక్తుల నమ్మకం. అయితే దర్శనాలు నిలిపేస్తారు అనే పుకార్లు, మరో 2నెలల్లో మేడారం జాతర రానుండడంతో భక్తులు ఇప్పటికే అధిక సంఖ్యలో రాజన్న దర్శనానికి వస్తున్నారు.


