News October 11, 2025
HYD: ఛార్జింగ్ స్టేషన్ పనిచేయడం లేదా..? ఇలా చేయండి..!

గ్రేటర్ HYDలో సుమారు 650 ఛార్జింగ్ స్టేషన్లు ఉన్నాయి. అయితే కొన్నిటిలో సాంకేతిక సమస్యలు ఏర్పడడంతో పనిచేయటం లేదు. ఈ నేపథ్యంలో రెడ్కో యాప్ ద్వారా ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. REDCO APP డౌన్‌లోడ్ చేసుకుని ఛార్జింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ ఉన్నాయో కూడా తెలుసుకోవచ్చు, ఫిర్యాదు చేయొచ్చు.
Similar News
News October 11, 2025
HYD: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు

జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవంబర్ 11వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. దీనికోసం అధికారులు 407 పోలింగ్ బూత్‌లను ఏర్పాటు చేశారు. ఈవీఎంలు, బ్యాలెట్ యూనిట్లు, వీవీ ప్యాట్‌లను భద్రపరిచేందుకు యూసుఫ్‌గూడ కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో స్ట్రాంగ్ రూమ్‌లను సిద్ధం చేస్తున్నారు. స్ట్రాంగ్ రూముల వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
News October 11, 2025
HYD: రూ.1,100 కోట్ల విలువైన భూమిని కాపాడిన హైడ్రా

HYDలోని పలు చోట్ల ఆక్రమణలను శుక్రవారం హైడ్రా తొలగించింది. ఒకేసారి నాలుగు ప్రాంతాల్లో కబ్జాల నుంచి ప్రభుత్వ భూమికి విముక్తి కల్పించింది. 12.50 ఎకరాల మేర ప్రభుత్వ భూమిని కాపాడింది. దీని విలువ రూ.1,100 కోట్ల వరకూ ఉంటుందని అంచనా. బంజారాహిల్స్ రోడ్డు నంబరు 10లో మొత్తం 5 ఎకరాల మేర ఉన్న కబ్జాలను తొలగించింది. ఇక్కడ ఈ భూమి విలువ రూ.750 కోట్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు.
News October 11, 2025
బండ్లగూడ మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డిపై కేసు నమోదు

రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మాజీ కార్పొరేటర్ శ్రీనాథ్ రెడ్డిపై కేసు నమోదైందని నార్సింగి పోలీసులు తెలిపారు. ఇల్లు నిర్మిస్తోన్న వ్యక్తిని బెదిరిస్తున్నాడని, రూ.10 లక్షలు డిమాండ్ చేశాడని ఆరోపిస్తూ బాధితులు తమను ఆశ్రయించారని చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.