News February 27, 2026
HYD: ఛీ.. ఛీ.. శవాల మీద పేలాలు ఏరుకోవడమంటే ఇదేనేమో..!

అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్లుగా ఉంది GHMC తీరు. ఆఖరికి ప్రజారోగ్యానికి చేసే దోమల ఫాగింగ్‌లోనూ స్కాంకు పాల్పడుతున్నారు. తాజాగా మల్కాజ్‌గిరి సర్కిల్‌లో ఫాగింగ్‌కు వాడే డీజిల్‌ను సూపర్వైజర్లు, AE, SEల అండతో సిబ్బంది రూ.10ల కమీషన్ చొప్పున పెట్రోల్ బంకులకు అమ్ముకుంటోంది. పంపకాల్లో తేడాలు రావడంతో ఈ ‘దోమల దండు’ బాగోతం బయటకు పొక్కింది. కాగా ప్రభుత్వం దోమల నివారణకు ఏడాదికి రూ.32 కోట్లు ఖర్చు చేస్తోంది.
Similar News
News February 27, 2026
హన్మకొండలో ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు

జిల్లాలో ఇంటర్ ప్రథమ సంవత్సర పరీక్షలు రెండో రోజు శుక్రవారం ప్రశాంతంగా ముగిశాయి. జిల్లా వ్యాప్తంగా జనరల్, వొకేషనల్ విభాగాల్లో కలిపి మొత్తం 18,803 మంది విద్యార్థులకు గాను, 18,397 మంది హాజరయ్యారు. దీంతో జిల్లాలో 98 శాతం హాజరు నమోదైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. మొత్తం 406 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరయ్యారు.
News February 27, 2026
ఏప్రిల్‌లో ఓటర్ల తుది జాబితా: కలెక్టర్ వెట్రిసెల్వి

జిల్లా ఓటర్ల తుది జాబితాను ఏప్రిల్‌లో ప్రచురించనున్నట్లు కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం ఆమె అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఎలక్టర్ మ్యాపింగ్ వివరాలను వెల్లడించారు. జిల్లాలో సగటున 60.72 శాతం మ్యాపింగ్ పూర్తయిందని, పెండింగ్‌లో ఉన్న 1,207 ఫారం- 6, 7, 8 దరఖాస్తులను తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గాల వారీగా చింతలపూడిలో అత్యధికంగా 69.11 శాతం మ్యాపింగ్ నమోదైంది.
News February 27, 2026
వాట్సాప్‌లో యాడ్స్ కనిపిస్తున్నాయా?

వాట్సాప్‌లో సరికొత్త అప్‌డేట్ వచ్చింది. ఇకపై ‘స్టేటస్’ విభాగంలో యాడ్స్, ‘అప్‌డేట్స్’ ట్యాబ్‌లో ప్రమోటెడ్ ఛానల్స్ అందుబాటులోకి వచ్చినట్లు వాట్సాప్ ప్రకటించింది. దీనివల్ల యూజర్‌కు అవసరమైన వ్యాపార సంస్థలతో సులభంగా కనెక్ట్ అవ్వొచ్చు. అయితే ఈ మార్పుల వల్ల ప్రైవసీకి ఎలాంటి ముప్పు ఉండదని స్పష్టం చేసింది. వ్యక్తిగత చాట్స్ ఎప్పటిలాగే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌తో పూర్తి సురక్షితంగా ఉంటాయని తెలిపింది.


