News July 7, 2025

HYD: జంట జలాశయాలలో నీరు పుష్కలం.!

image

HYD నగర శివారు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉందని జలమండలి తెలిపింది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782.75 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా, ప్రస్తుతం 1758 అడుగులు ఉన్నట్లు తెలిపారు. గత రికార్డుతో పోలిస్తే ఈసారి నీరు అధికంగా ఉందన్నారు.

Similar News

News July 7, 2025

అన్నా క్యాంటీన్‌లో ఆహారం నాణ్యంగా ఉండాలి: కలెక్టర్

image

రామచంద్రపురంలోని అన్నా క్యాంటీన్‌ను జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ సోమవారం తనిఖీ చేశారు. అందిస్తున్న ఆహార నాణ్యత, పరిశుభ్రతపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం పేదల ఆకలి తీర్చాలనే లక్ష్యంతో అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసిందని పేర్కొన్నారు. ఆహార పదార్థాలు నాణ్యంగా ఉండాలని ఈ సందర్భంగా కలెక్టర్ స్పష్టం చేశారు.

News July 7, 2025

చుక్క నీటినీ వదులుకోం: మంత్రి పొంగులేటి

image

TG: రాష్ట్రానికి హక్కుగా వచ్చే నీటిని వదులుకునే ప్రసక్తే లేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తేల్చి చెప్పారు. ‘గత ప్రభుత్వం మన నీటి హక్కులను పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టింది. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును చేవెళ్ల వరకు పొడిగించకుండా హైదరాబాద్‌తో ఆపారు. గత పాలకులు వేసిన పునాదే నేటి బనకచర్ల ప్రాజెక్టు. ఇందిరమ్మ ప్రభుత్వం ఉన్నంతకాలం చుక్క నీటిని కూడా వదులుకోం’ అని వ్యాఖ్యానించారు.

News July 7, 2025

డంపింగ్ యార్డ్ పరిశీలించిన కలెక్టర్

image

అమలాపురం నల్ల వంతెన సమీపంలోని డంపింగ్ యార్డ్‌ను జిల్లా కలెక్టర్ ఆర్. మహేశ్ కుమార్ సోమవారం మున్సిపల్ కమిషనర్ నిర్మల్ కుమార్‌తో కలిసి పరిశీలించారు. డంపింగ్ యార్డ్ నిర్వహణ సరిగా లేకపోతే వివిధ సమస్యలతో పాటు పర్యావరణానికి తీవ్ర నష్టం కలుగుతుందని కలెక్టర్ హెచ్చరించారు. తరుణి కాంట్రాక్టర్‌తో 22,500 టన్నుల చెత్తను ప్రాసెసింగ్ చేసి, వ్యర్థాలను వేరు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.