News July 7, 2025
HYD: జంట జలాశయాలలో నీరు పుష్కలం.!

HYD నగర శివారు జంట జలాశయాలైన ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాశయాల్లో నీరు పుష్కలంగా ఉందని జలమండలి తెలిపింది. ఉస్మాన్‌సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా ప్రస్తుతం 1782.75 అడుగులు ఉన్నట్లు పేర్కొన్నారు. మరోవైపు హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.5 అడుగులు కాగా, ప్రస్తుతం 1758 అడుగులు ఉన్నట్లు తెలిపారు. గత రికార్డుతో పోలిస్తే ఈసారి నీరు అధికంగా ఉందన్నారు.
Similar News
News July 7, 2025
క్రీడల అభివృద్ధిపై కేంద్ర మంత్రితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కేంద్ర క్రీడలశాఖ మంత్రి మన్‌సుఖ్ మాండవీయను సీఎం రేవంత్‌రెడ్డి భేటీ అయ్యారు. ఖేలో ఇండియా, 40వ నేషనల్ గేమ్స్ వంటి జాతీయ, అంతర్జాతీయ క్రీడా పోటీలు తెలంగాణకు వచ్చేలా అవకాశాలు కల్పించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా పథకం కింద శిక్షణ, వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలన్నారు. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు రైల్వే ఛార్జీల్లో రాయితీ మళ్లీ అందించాలని కోరారు.
News July 7, 2025
కాచిగూడ- యశ్వంత్‌పుర వందేభారత్ కోచ్‌ల సంఖ్య పెంపు

కాచిగూడ- యశ్వంత్‌పర వందే భారత్ కోచుల సంఖ్యను రైల్వే శాఖ పెంచింది. ప్రస్తుతం 8 కోచ్‌లు 530 సీటింగ్ కెపాసిటీతో నడుస్తున్న ఈ ట్రైన్ జూలై 10 నుంచి 16 కోచ్‌లు 1,128 సీటింగ్ కెపాసిటీతో పరుగులు పెట్టబోతోంది. ప్రస్తుతం 7 చైర్‌కార్, 1 ఎగ్జిక్యూటివ్ క్లాస్‌తో నడుస్తుండగా ఇకపై 14 చైర్‌కార్, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లు ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.
News July 7, 2025
HYD: TDF సిల్వర్ జూబ్లీ వేడుకలకు సీఎంకు ఆహ్వానం

అమెరికాలో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం సిల్వర్ జూబ్లీ వేడుకలకు CM రేవంత్‌రెడ్డికి TDF ప్రతినిధులు ఆహ్వానించారు. కాలిఫోర్నియాలో ఆగస్టు 8, 9,10 తేదీల్లో జరిగే 25 ఏళ్ల వేడుకల పోస్టర్‌ను CM ఆవిష్కరించారు. ప్రత్యేక రాష్ట్ర సాధనకు ఆ తర్వాత తెలంగాణలో TDF చేస్తున్న నిరంతర అభివృద్ధి పనులను CM ప్రశంసించారు. TDF ఇండియా ప్రెసిడెంట్ మట్ట రాజేశ్వర్‌రెడ్డి, EX ప్రెసిడెంట్ కవిత చల్ల, సెక్రటరీ వినీల్ ఉన్నారు.