News November 23, 2025

HYD: జంట జలాశయాల ప్రత్యేకత ఇదే!

image

ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జంట జలాశయాలు నగరవాసుల దాహార్తిని తీరుస్తున్నాయి. మూసీ నది 1908లో భాగ్యనగరాన్ని వరదలతో ముంచెత్తగా.. అప్పటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఆ వరదలకు అడ్డుకట్ట వేసేందుకు 1920-1926లో మూసీ, ఈసీ నదులపై మోక్షగుండం విశ్వేశ్వరయ్య ప్రణాళికతో వంతెనలు నిర్మించారు. అప్పటి నుంచి నగరానికి తాగునీటి సరఫరా చేయడం ప్రారంభించారు.

Similar News

News November 23, 2025

భారత్vsదక్షిణాఫ్రికా.. రెండో రోజు ముగిసిన ఆట

image

గువాహటిలో దక్షిణాఫ్రికా, టీమ్ ఇండియా మధ్య జరుగుతున్న రెండో టెస్టు రెండో రోజు ఆట ముగిసింది. టీమ్ ఇండియా తొలి ఇన్నింగ్సులో వికెట్లేమీ కోల్పోకుండా 9 పరుగులు చేసింది. అంతకుముందు తొలి ఇన్నింగ్సులో దక్షిణాఫ్రికా 489 రన్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇంకా పంత్ సేన 480 పరుగులు వెనుకబడి ఉంది. క్రీజులో జైస్వాల్(7), రాహుల్(2) ఉన్నారు. రేపు దూకుడుగా ఆడి లీడ్ దిశగా సాగితేనే మ్యాచ్‌పై పట్టు బిగించే అవకాశం ఉంది.

News November 23, 2025

వివిధ పండ్ల తోటలు – పిందె రాలడానికి కారణాలు

image

☛ మామిడి -పుష్పాలలో పరాగ సంపర్క లోపం, పుష్ప దశలో వర్షం, హార్మోన్ల అసమతుల్యత, రసం పీల్చే పురుగుల దాడి
☛ నిమ్మ, బత్తాయి – అధిక వర్షాలు, అధిక ఎరువుల వాడకం, పాము పొడ పురుగు
☛ ద్రాక్ష – అధిక ఉష్ణోగ్రతలు, వర్షాభావం, అధిక తేమ, బూడిద, ఆంత్రాక్నోస్ తెగులు
☛ బొప్పాయి – పరాగసంపర్కం లోపం, బోరాన్ లోపం, అధిక వర్షం లేదా నీరు నిల్వ ఉండిపోవడం, బూడిద తెగులు పుష్పాలపై రావడం వల్ల పిందెలు రాలిపోతాయి.

News November 23, 2025

మావోయిస్టు కీలక నేతల్లో సిక్కోలు వాసులు

image

మావోయిస్టు కేంద్ర, రాష్ట్ర కమిటీ కీలక నేతల్లో సిక్కోలు వాసులు ఉన్నారు. గత కొద్ది నెలల క్రితం ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్ కౌంటర్‌లో జిల్లాకు చెందిన నంబాళ్ల కేశవరావు మృతిచెందగా, తాజాగా మరేడుమిల్లిలో జరిగిన ఎన్ కౌంటర్ లో జిల్లాలోని బాతుపురం గ్రామానికి చెందిన మావోయిస్టు కీలకనేత మెట్టూరు జోగారావు(టెక్ శంకర్) మరణించారు. అదే ప్రాంతానికి చెందిన చెల్లూరు నారాయణరావు(సూరన్న) అజ్ఞాతంలో ఉన్నారు.