News December 22, 2025
HYD: జనవరి 13 నుంచి ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్..!

HYDలో సంక్రాంతి సందర్భంగా వచ్చే నెల జనవరి 13 నుంచి 15 వరకు ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ పరేడ్ గ్రౌండ్లో జరగనుంది. సీఎం ఆదేశాల మేరకు ఏర్పాట్లను సీఎస్ రామకృష్ణారావు సోమవారం సమీక్షించారు.వివిధ దేశాల నుంచి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నాను. ఈ ప్రోగ్రాంతో రంగురంగుల గాలిపటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో HYD నగరం పండుగ ఉత్సాహంతో కళకళలాడనుంది.
Similar News
News December 22, 2025
టీడీపీ ముఖ్య నేతలతో జ్యోతుల నవీన్ భేటీ

కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా నియమితులైన జ్యోతుల నవీన్ జిల్లాలోని ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌లను కలుస్తున్నారు. సోమవారం ఆయన రూరల్ మాజీ ఎమ్మెల్యే పిల్లి అనంత లక్ష్మి సత్తిబాబు, సిటీ ఎమ్మెల్యే కొండబాబు, పత్తిపాడు ఎమ్మెల్యే సత్యప్రభ, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడులను మర్యాదపూర్వకంగా కలిశారు. పార్టీ అభివృద్ధికి, తనకు సహకరించాలని కోరారు.
News December 22, 2025
ఖమ్మంలో ఈనెల 24న జాబ్ మేళా

ఖమ్మం టీటీడీసీ భవనంలో ఈనెల 24న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ ఒక ప్రకటనలో తెలిపారు. భారత్ హ్యుందాయ్ కంపెనీలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి ఏదైనా డిగ్రీ అర్హత గల 24-35 వయస్సు గల యువతీ, యువకులు అర్హులని చెప్పారు. ఆసక్తి కలిగిన నిరుద్యోగులు విద్యార్హత పత్రాలతో ఉదయం 10 గంటలకు జరిగే జాబ్ మేళాలో పాల్గొనాలని పేర్కొన్నారు.
News December 22, 2025
బాల్యవివాహాలు సమాజానికి శాపం: నంద్యాల కలెక్టర్

బాల్యవివాహాలు పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తాయని నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో బాల్యవివాహాల నిర్మూలనపై వందరోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ఆమె ప్రతిజ్ఞ చేశారు. చట్టప్రకారం 18 ఏళ్లలోపు బాలికలకు, 21 ఏళ్లలోపు బాలురకు వివాహం చేయడం నేరమని, దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్పష్టం చేశారు.


