News January 6, 2026
HYD: జనవరి 8, 9న నీటి సరఫరా బంద్!

HYDలో పలు చోట్ల నీటి సరఫరా బంద్ కానుంది. JAN 8న ఉదయం 10 గంటల నుంచి JAN 9న తెల్లవారుజామున 4 గంటల వరకు సింగూరు ప్రాజెక్ట్ మెయిన్ పైప్‌లైన్‌లో లీకేజీలకు మరమ్మతులు చేయనున్నారు. ఈ కారణంగా మాదాపూర్, కొండాపూర్, మియాపూర్, ఫతేనగర్, బాలానగర్, చందానగర్ తదితర ప్రాంతాల్లో 18 గంటల పాటు తాగునీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని HMWSSB తెలిపింది.
Similar News
News January 9, 2026
హుస్సేన్‌సాగర్ చుట్టూ నైట్ బజార్!

హుస్సేన్‌సాగర్.. ప్రశాంతంగా ఉండే బుద్ధుడి విగ్రహం, NTR మార్గ్‌లో స్ఫూర్తినిచ్చే భారీ అంబేడ్కర్ విగ్రహం, ట్యాంక్‌బండ్‌పై ఉద్యమ స్ఫూర్తిని రగిల్చే తెలంగాణ అమరుల స్థూపం ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి. అర్ధరాత్రి వరకు ఇక్కడ సందర్శకుల సందడి ఉంటుంది. ఇంకా ఆ పక్కనే తెలంగాణ సచివాలయం స్పాట్ అందరికీ ఫేవరెట్. వినోదం కోసం లుంబిని పార్క్, ఇందిరా పార్క్ ఉన్నాయి. ఇటువంటి ప్రాంతంలో HMDA నైట్ బజార్‌కు ప్లాన్ వేస్తోంది.
News January 9, 2026
HYD ట్రాఫిక్ వ్యవస్థలో AI.. మీ కామెంట్?

HYDలో ట్రాఫిక్ ఉల్లంఘనకు చెక్ పెట్టేందుకు AI రాంగ్ వే డిటెక్షన్ వ్యవస్థను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రాంగ్ రూట్‌లో వెళ్లినా, హెల్మెట్ లేకపోయినా ఈ కెమెరాలు కనిపెట్టేస్తాయి. కేవలం జరిమానాల మీద దృష్టి పెట్టి, రోడ్ల దుస్థితిని గాలికొదిలేస్తే ప్రయోజనం ఏంటి? అని విమర్శలొస్తున్నాయి. టెక్నాలజీతో భద్రత పెరగడం మంచిదే.. కేవలం చలానాల వసూలు యంత్రంగా AI మారకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై మీ కామెంట్?
News January 9, 2026
రీల్స్ వైరలా కావాలా? జూబ్లీహిల్స్ వచ్చేయండి!

మీరు తీసే ట్రావెల్ వీడియోలు వైరల్ అవ్వడం లేదని ఫీలవుతున్నారా? FTCCI టూరిజం కమిటీ ఆధ్వర్యంలో JAN 17న జూబ్లీహిల్స్‌లోని ‘క్రియేటర్ వర్స్’లో రీల్ మేకింగ్ బూట్‌క్యాంప్ జరుగుతోంది. ₹500లకే షూటింగ్, ఎడిటింగ్ ట్రిక్స్ నేర్చుకోవచ్చు. అద్భుతమైన రీల్స్ చేసి ₹50,000 నగదు బహుమతులు గెలుచుకునే ఛాన్స్ మీ సొంతం. మీ స్మార్ట్‌ఫోన్ తీయండి, క్రియేటర్ అయిపోండి! మరిన్ని వివరాలకు 98480 42020లో సంప్రదించండి.


