News February 27, 2026

HYD: జరిగింది సరే.. ఎవరు బాధ్యత వహిస్తారు..?

image

దాదాపు 30% డిజిటల్ మీటర్లు పనిచేయడం లేదని స్వయంగా హైదరాబాద్ మహానగర జలమండలి అధికారులే క్షేత్రస్థాయి పరిశీలనలో గుర్తించారు. మీటర్లు రీడింగ్ చూపించకపోవడం వల్ల వినియోగదారులకు ‘లాక్డ్ రీడింగ్’ (Locked Reading) పడటం లేదు. దీంతో వచ్చే అదనపు ఆదాయం బోర్డుకు వెళ్తున్నా, మీటర్ల కొనుగోళ్లలో జరిగిన నష్టానికి ఎవరు బాధ్యత వహిస్తారు..?

Similar News

News March 1, 2026

చరిత్రలో ఈరోజు (మార్చి 1)

image

* 1901: ఆంధ్రరాష్ట్ర తొలి శాసనసభ స్పీకర్ నల్లపాటి వెంకటరామయ్య జననం
* 1951: బిహారీ సీఎం నితీశ్ కుమార్ జననం (ఫొటోలో)
* 1955: తెలుగు భాషావేత్త వెలమల సిమ్మన్న జననం
* 1986: సింగర్ ఎన్.సీ.కారుణ్య జననం
* 1989: మహారాష్ట్ర మాజీ సీఎం వసంత్‌దాదా పాటిల్ మరణం
* ప్రపంచ పౌర రక్షణ దినోత్సవం
* జీరో డిస్క్రిమినేషన్ డే

News March 1, 2026

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News March 1, 2026

NZB: డీసీఎం ఢీకొని చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

image

డీసీఎం వ్యాను ఢీకొన్న ఘటనలో చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందినట్లు రూరల్ SHO శ్రీనివాస్ తెలిపారు. నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జన్నేపల్లి రోడ్డు వద్ద శుక్రవారం మధ్యాహ్నం బైక్‌పై వెళుతున్న ముగ్గురు వ్యక్తులను డీసీఎం వ్యాను ఢీ కొట్టింది. దీంతో క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వారిలో పరుశురాం సదా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు SHO తెలిపారు.