News July 6, 2025
HYD: జవాన్ల కోసం 3D ప్రింటింగ్ భవనం

సివిల్ ఇంజినీరింగ్‌లో టెక్నాలజీ రోజు రోజుకు నూతన పుంతలు తొక్కుతోంది. దేశంలోని తొలిసారి జవాన్ల కోసం మధ్యప్రదేశ్ గాల్వియర్‌లో 3D ప్రింటింగ్ భవనాన్ని నిర్మించారు. ఈ నిర్మాణంలో మన IIT హైదరాబాద్ కీలకపాత్ర పోషించింది. ఇందులో ఏకంగా సుమారు 14 మంది జవాన్లు నివసించే అవకాశం ఉంటుంది. సాధారణ నిర్మాణాలు సాధ్యం కాని ప్రాంతాలలో ఈ త్రీడీ ప్రింటింగ్ టెక్నాలజీ ఉపయోగిస్తారు.
Similar News
News July 7, 2025
అచ్చంపేట: ప్రమాదవశాత్తు ట్రాక్టర్ తగిలి బాలుడు మృతి

ట్రాక్టర్ తగిలి నాలుగేళ్ల బాలుడు మృతిచెందిన ఘటన అచ్చంపేట మండలంలో నిన్న జరిగింది. ఏఎస్ఐ నరసింహారెడ్డి తెలిపిన వివరాలు.. శివారుతండాకి చెందిన హన్మంతు, తేజ దంపతులకు ఇద్దరు కుమారులున్నారు. హన్మంతు ట్రాక్టర్‌తో ఇంటి ఎదుట చదును చేస్తుండగా దాని వెనకే ఉన్న వారి చిన్న కొడుకు జశ్వంత్ ప్రమాదవశాత్తు ట్రాక్టర్ చక్రానికి తగిలాడు. ఘటనలో బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. తేజ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.
News July 7, 2025
HYD: ల్యాండ్ మీద ఇన్వెస్ట్‌మెంట్.. హైడ్రా కీలక సూచన

భూమిపై పెట్టుబడి పెట్టాలనుకునే వారికి హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక సూచన చేశారు. NRI వ్యక్తులు, పెట్టుబడిదారులు భూ కొనుగోలుకు ముందు HMDA వెబ్‌సైట్ ద్వారా FTL, బఫర్‌జోన్ వివరాలు తెలుసుకోవచ్చన్నారు. హైడ్రా కూడా చెరువుల FTL నోటిఫికేషన్ కోసం నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో కలిసి పనిచేస్తోంది. శాటిలైట్ డేటా, 2006 మ్యాప్స్ ఆధారంగా త్వరలో 15 సెం.మీ. రిజల్యూషన్‌తో 3Dమోడల్స్ రూపొందిస్తున్నారన్నారు.
News July 7, 2025
ఈ నెల 13న ఓదెల మల్లన్న పెద్దపట్నం

పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలోని భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయ పెద్దపట్నాలు ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈనెల 13న స్వామి వారి పెద్దపట్నం, అగ్నిగుండ మహోత్సవం నిర్వహిస్తున్నట్టు పేర్కొన్నారు. ఆదివారం ఉదయం 9 గంటలకు గణపతి పూజ పుణ్యహవాచనము, మంటస్థాపన, శ్రీ వీరభద్రరాధన, రాత్రి 10 నుంచి 14వ తేదీ ఉదయం 5 గంటల వరకు అగ్నిగుండ ప్రజ్వలన, పెద్దపట్నం నిర్వహిస్తున్నామని తెలిపారు.