News October 13, 2025
HYD: జాగ్రత్త! HSRP పేరుతో మోసాలు!

హై సెక్యూరిటీ నంబర్ ప్లేట్ బిగించుకోలేదంటూ ఇటీవల క్యాబ్ డ్రైవర్లకు నకిలీ ఆర్టీఏ చలాన్ కాల్స్ వస్తున్నాయి. మీకు రూ.3,400 జరిమానా పడిందని మోసగాళ్లు చెబుతున్నారు. దీనిపై ఆందోళన చెందిన ఓ డ్రైవర్ స్థానిక అధికారులను సంప్రదించగా, అది నకిలీ కాల్ అని తేలింది. HSRP సంబంధించి ఎలాంటి తుది గడువును ఇప్పటివరకు ప్రభుత్వం విధించలేదని అధికారులు స్పష్టం చేశారు.
Similar News
News October 13, 2025
చేవెళ్ల మాజీ ఎమ్మెల్యేకు జర్నలిజం మీద మక్కువ

చేవెళ్ల మాజీ ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి వృద్ధాప్య సమస్యలతో HYDలోని అపోలో ఆస్పత్రిలో తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. ఆయన జీవితాంతంల కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. 2 సార్లు హైదరాబాద్ ఎంపీగా పోటీ చేసిన ఆయన జర్నలిజంపై మక్కువతో న్యూస్ సర్వీస్ సిండికేట్ సంస్థను స్థాపించారు. మరికాసేపట్లో జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్థానానికి అంతిమయాత్ర జరగనుంది.
News October 13, 2025
NZSR: వాహనం ఢీకొని బాలిక మృతి

వాహనం ఢీకొని చిన్నారి మృతి చెందిన ఘటన నిజాంసాగర్(M) అచ్చంపేటలో సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. మధురశ్రీ(3) బహిర్భూమికి వెళ్లి పరుగెత్తుకు వెళ్తుండగా అకస్మాత్తుగా గూడ్స్ వాహనం వెనక టైర్ కింద పడింది. ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఇంటికి తీసుకువచ్చిన తరువాత మళ్లీ ఆరోగ్యం విషమించడంతో ఆసుపత్రికి తీసుకువెళ్లగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
News October 13, 2025
కూల్ అండ్ గ్లో ఫేస్ ప్యాక్

పొడిచర్మం ఉన్నవారు పలు చర్మ సమస్యలను ఎదుర్కొంటారు. వారి చర్మంలోని మాయిశ్చర్‌ని రిస్టోర్ చేయడానికి ఈ బీట్‌రూట్ ఫేస్‌ప్యాక్ పనిచేస్తుంది. ముందుగా బీట్‌రూట్ జ్యూస్, శనగపిండి, పెరుగు, తేనె కలుపుకోవాలి. దీన్ని ముఖానికి అప్లై చేసి 10 ని. తర్వాత శుభ్రం చేసుకుంటే చర్మం తాజాగా, కాంతిమంతంగా మారుతుంది. వారానికి మూడుసార్లు ఈ ప్యాక్‌ను అప్లై చేసుకోవడం వల్ల చర్మం తాజాగా ఉంటూ మెరుపును సంతరించుకుంటుంది. <<-se>>#skincare<<>>