News October 7, 2025
HYD: జాతీయ పార్టీలు ఆలస్యమెందుకు..?

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక చుట్టూనే ఇప్పుడు తెలంగాణ రాజకీయం తిరుగుతోంది. కాగా ప్రాంతీయ పార్టీ అయిన BRS అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించి క్షేత్రస్థాయిలో ప్రచారంలోకి దిగిందని, జాతీయ పార్టీలైనా కాంగ్రెస్, BJP మాత్రం ఇంకా ఆలస్యమెందుకు చేస్తున్నాయో అర్థంకావడం లేదని స్థానికంగా చర్చ సాగుతోంది. అయితే బలమైన అభ్యర్థుల కోసం అధిష్ఠానాలు చూస్తున్నాయని ఆయా పార్టీల నాయకులు చెబుతున్నారు. దీనిపై మీ కామెంట్?
Similar News
News October 7, 2025
గూగుల్ మ్యాప్స్‌లో ఆర్టీసీ బస్సుల సమాచారం!

TG: బస్సుల సమాచారాన్ని ప్రయాణికులకు RTC మరింత చేరువ చేయనుంది. దీపావళి నుంచి బస్సుల వివరాలను గూగుల్ మ్యాప్స్ ద్వారా విడతలవారీగా ప్రయాణికులకు అందించాలని చూస్తోంది. దీంతో పాటు ‘మీ టికెట్’ యాప్ ద్వారా QR కోడ్ టికెట్లు, QR ఆధారిత డిజిటల్ పాస్‌లు అందుబాటులోకి రానున్నాయి. త్వరలోనే ప్రారంభ తేదీని ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అటు మరో 3 నెలల్లో HYD పరిధిలో 275 EV బస్సులు అందుబాటులోకి రానున్నాయి.
News October 7, 2025
NLG: ఇండ్లు అద్దెకు తీసుకొని.. హైటెక్ వ్యభిచారం!

ఉమ్మడి జిల్లాలో వ్యభిచారం విచ్చలవిడిగా నడుస్తున్నది. ఒక వైపు పోలీసులు వ్యభిచార స్థావరాలపై దాడులు చేసి విటులు, వ్యభిచార నిర్వాహకులను అరెస్టు చేస్తున్నా అక్రమ కార్యకలాపాలు ఎప్పటిలాగానే కొనసాగుతున్నాయి. KDD, SRPT, MLG, NLG వంటి ప్రాంతాల్లో ఇప్పుడు హైటెక్ హంగులతో కొందరు యథేచ్ఛగా వ్యభిచారం నడిపిస్తున్నారు. నిర్వాహకులు పోలీసులకు అనుమానం రాకుండా ఇండ్లు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు.
News October 7, 2025
జూబ్లీహిల్స్ బైపోల్.. BJP లిస్ట్‌లో నందమూరి సుహాసిని పేరు..?

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గంపై బీజేపీ దృష్టి సారించింది. పోటీ అభ్యర్థి ఎంపిక కోసం ముగ్గురు సభ్యుల కమిటీని పార్టీ నియమించింది. లంకాల దీపక్ రెడ్డి, కీర్తి రెడ్డి, నందమూరి సుహాసిని సహా ఏడుగురి పేర్లు షార్ట్‌లిస్ట్‌లో ఉన్నట్లు సమాచారం. ఈ సాయంత్రం అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉండగా రాబోయే రోజుల్లో జూబ్లీహిల్స్‌లో ఎన్నికల రణరంగం మరింత వేడెక్కనుంది.