News April 19, 2024
HYD: జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్ల తొలగింపు: ఈసీ

హైదరాబాద్ నగరంలో రికార్డు స్థాయిలో డూప్లికేట్ ఓట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘం గుర్తించింది. గత రెండేళ్లలో దాదాపు 60.6 లక్షల మంది కొత్త ఓటర్లు చేరినట్లు సీఈఓ వికాస్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 5 లక్షల డూప్లికేట్ ఓట్లు తొలగించినట్లు ఈసీ పేర్కొంది. చాంద్రాయణగుట్టలో 59,289 ఓట్లు, యాకుత్‌పురాలో 48,296 డూప్లికేట్ ఓట్లు గుర్తించామని ఎన్నికల సంఘం వెల్లడించింది.
Similar News
News September 11, 2025
ఎంబీఏ ఈవినింగ్ పరీక్షా ఫీజు స్వీకరణ

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ ఈవినింగ్ పరీక్షా ఫీజును స్వీకరించనున్నట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ ఈవినింగ్ రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫీజును ఈ నెల 18వ తేదీలోగా సంబంధిత కళాశాలల్లో చెల్లించాలని చెప్పారు. రూ.300 అపరాధ రుసుముతో 23వ తేదీ వరకు చెల్లించవచ్చని పేర్కొన్నారు.
News September 11, 2025
మిలాద్-ఉన్-నబీ, నవరాత్రుల భద్రతపై HYD సీపీ సమీక్ష

నగర సీపీ సీవీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నగర పోలీసు అధికారులతో సమావేశమై సెప్టెంబర్ 14న జరగనున్న మిలాద్-ఉన్-నబీ జూలూస్, రాబోయే దుర్గానవరాత్రి వేడుకల భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు. అధికారులు ప్రణాళికలు వివరించగా, సీపీ కఠినమైన ప్రోటోకాల్స్ పాటించాలని, విభాగాల మధ్య సమన్వయం తప్పనిసరి అని సూచించారు.గణేశ్ నవరాత్రులలో పోలీసుల పనితీరును ప్రశంసించిన ఆయన, రాబోయే పండుగల్లోనూ అదే నిబద్ధత చూపాలన్నారు.
News September 11, 2025
చాంద్రాయణగుట్టలో సిమ్ బాక్స్ గ్యాంగ్ ముగ్గురి అరెస్ట్

చాంద్రాయణగుట్టలో సిమ్ బాక్స్ ఏర్పాటు చేసి ఇంటర్నేషనల్ కాల్స్‌ను లోకల్ కాల్స్‌గా మార్చిన గ్యాంగ్‌ను TG సైబర్ సెక్యూరిటీ బ్యూరో పట్టుకుంది. హిదాయతుల్లా, ఆహద్‌ఖాన్, షోయబ్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఒక సిమ్ బాక్స్, దాదాపు 200 సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. విచారణలో హాంకాంగ్‌కు చెందిన మహిళ వెనీసా మార్గదర్శకత్వంలో ఈ రాకెట్ నడిచినట్టు బయటపడింది.