News March 29, 2026

HYD: జిల్లాల్లో పడిపోతున్న గ్రౌండ్ లెవెల్స్

image

HYD, మేడ్చల్, రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలో రోజురోజుకూ భూగర్భ జలాల స్థాయి పడిపోతోంది. వేసవికి ముందే అనేక ప్రాంతాల్లో బోరు బావులు ఎండిపోతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా వికారాబాద్ జిల్లాలో భూగర్భ జలాలు సగటున 12.87 మీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఎండలు ముదిరితే పరిస్థితి ఎలా ఉంటుందోనని ప్రజల్లో ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

Similar News

News April 13, 2026

తూ.గో: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసు.. విచారణ వాయిదా..!

image

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితులుగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు, ఆయన సతీమణి లక్ష్మీదుర్గ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ బుధవారానికి వాయిదా పడింది. తమను ఈ కేసు నుంచి తప్పించాలంటూ వారు రాజమండ్రి కోర్టును ఆశ్రయించారు. సోమవారం జరిగిన విచారణలో ఉభయ పక్షాల వాదోపవాదాలను విన్న రాజమండ్రి ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు, తదుపరి విచారణను ఈనెల 15వ తేదీకి వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

News April 13, 2026

వాన్స్ నాకు కాల్ చేశారు: నెతన్యాహు

image

శాంతి చర్చలు విఫలమైన తర్వాత తిరుగు పయనంలో వాన్స్ తనతో మాట్లాడినట్లు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. శుద్ధి చేసిన యురేనియాన్ని వదులుకోవడంతో పాటు భవిష్యత్తులో ఆ దిశగా అడుగులు వేయబోమన్న హామీని ఇరాన్ నుంచి కోరామని వాన్స్ వివరించినట్లు చెప్పారు. దీని కేంద్రంగానే చర్చలు జరిగినట్లు తెలిపారని వెల్లడించారు. నెతన్యాహు నుంచి <<19635452>>కాల్ రావడం<<>> వల్లే చర్చలు విఫలమయ్యాయని ఇరాన్ ఆరోపించిన విషయం తెలిసిందే.

News April 13, 2026

NZB: లంచం డిమాండ్ చేస్తే ఫిర్యాదు చేయండి: ACB

image

ప్రభుత్వ కార్యాలయాల్లో ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే భయపడకుండా తమకు ఫిర్యాదు చేయాలని NZB ACB డీఎస్పీ జీ.శేఖర్ గౌడ్ సూచించారు. కొత్త కార్యాలయం అందుబాటులోకి రావడంతో ప్రజలు నేరుగా వచ్చి తమ ఫిర్యాదులను అందజేయవచ్చని తెలిపారు. అవినీతిపై సమాచారం ఇచ్చే వారు 1064 టోల్ ఫ్రీ నంబర్‌కు లేదా 91543-88950 (DSP), CI 91543-88923, 91543-88951 నంబర్లను సంప్రదించాలన్నారు.