News March 21, 2024

HYD: జీరో బిల్లు రానివారికి ప్రత్యేక కౌంటర్లు

image

అన్ని అర్హతలు ఉండీ గృహజ్యోతి పథకం కింద జీరో బిల్లు రానివారి కోసం ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని, ఆహారభద్రత వివరాలు తప్పుగా నమోదు వంటి కారణాల వల్ల అనేకమంది జీరో బిల్లుకు దూరమయ్యారు. ఇలాంటి వారు తమ వివరాలు సరిచేసుకునేందుకు మండల పరిషత్తు, మున్సిపల్, GHMC సర్కిల్ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం పేర్కొంది.

Similar News

News September 29, 2024

HYD: రాజాసింగ్ ఇంటి వద్ద అనుమానాస్పద వ్యక్తుల రెక్కీ

image

HYD గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఇంటి వద్ద ఇద్దరు అనుమానాస్పద వ్యక్తులు రెక్కీ నిర్వహించారు. అనుమానం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించి వారిని అప్పగించారు. అనుమానితుల ఫోనులో తుపాకులు, బుల్లెట్లు, రాజాసింగ్ ఫొటో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరిని ఇస్మాయిల్, మహమ్మద్ ఖాజాగా గుర్తించారు. రాజాసింగ్ హత్యకు ఏమైనా కుట్ర పన్నారా? అని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

News September 29, 2024

HYD: దూరవిద్య కోర్సుల పరీక్ష తేదీల ఖరారు!

image

PGRRCDE ద్వారా అందించే వివిధ కోర్సుల పరీక్ష తేదీలను ఖరారు చేసినట్టు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొ. రాములు తెలిపారు. ఎంసీఏ మొదటి, మూడో సెమిస్టర్ ప్రాక్టికల్ పరీక్షలను వచ్చే నెల 5 నుంచి, పీజీడీసీఏ 1వ, 2వ సెమిస్టర్ బ్యాక్ లాగ్, అడ్వాన్స్డ్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ అప్లికేషన్స్ మొదటి సెమిస్టర్ మెయిన్ పరీక్షలను వచ్చే నెల 16 నుంచి నిర్వహిస్తామన్నారు. వివరాలకు www.osmania.ac.in లో చూడాలన్నారు.

News September 29, 2024

HYD: భూముల సేకరణలో TDR జారీకి కసరత్తు..!

image

HYD మీరాలం చెరువుపై చింతల్ మెట్ నుంచి బెంగళూర్ వైపు వెళ్లే రోడ్డు వరకు 2.5KM వంతెన నిర్మాణంలో ప్రైవేటు స్థలాలను సేకరించాల్సి ఉంది. ప్రైవేటు భూములకు పూర్తిగా TDR జారీ చేసేందుకు HMDA అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. మియాపూర్ నుంచి గండిమైసమ్మ మార్గంలో చేపడుతున్న రోడ్డు విస్తరణ, శివారు మున్సిపాలిటీల్లోని పనులకు TDR జారీ చేయనున్నారు.