News March 29, 2025

HYD: జీహెచ్ఎంసీ కొత్త యాప్.. ఆన్ లైన్ చలాన్ !

image

హైదరాబాద్ నగర పరిశుభ్రతను మెరుగు పరిచేందుకు జీహెచ్ఎంసీ త్వరలో కొత్త యాప్‌ను ప్రారంభించనుంది. ప్రముఖ ఐటీ సంస్థ టీసీఎస్ రూపొందించిన ఈ యాప్ ద్వారా చెత్త నిర్వాహణ మరింత సమర్థంగా మారనుంది. ఎక్కడ పడితే అక్కడ చెత్త, నిర్మాణ వ్యర్థాలు వేయడాన్ని నివారించేందుకు ఈ-చలాన్లు జారీ చేస్తారు. చలాన్ల చెల్లింపులు యూపీఐ ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. దీంతో లావాదేవీలు పారదర్శకంగా ఉంటాయి.

Similar News

News March 31, 2025

సిద్దిపేట్: స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టాలి: కిషన్ రెడ్డి

image

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టిపెట్టాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాష్ట్ర పదాధికారులు జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఎమ్మెల్సీలుగా గెలిచిన మల్క కొమురయ్య, అంజిరెడ్డిలను అభినందించారు.

News March 31, 2025

రంజాన్.. HYDలో వీటికి ఫుల్ DEMAND

image

HYD నగరంలో రంజాన్ పండుగ వేళ బిర్యానీ, క్యాబ్స్, బుకింగ్ ఆటోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పండగ కావడంతో రెడ్ హిల్స్ లాంటి అనేక ప్రాంతాల్లో ముస్లిం ఆటో డ్రైవర్లు సెలవు తీసుకున్నారు. మరోవైపు పండగ వేళ నగరంలో రద్దీగా ఉండడంతో సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ ఆటోలకు 20 నుంచి 30 శాతం అధికంగా చార్జీలు పడుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఆన్‌లైన్ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటల్స్ కిక్కిరిస్తున్నాయి.

News March 31, 2025

సిద్ధాంతాలకు అనుగుణంగా నడుచుకోవాలి: పల్లా

image

టీడీపీ సిద్ధాంతాలకు అనుగుణంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు నడుచుకోవాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. సోమవారం అచ్యుతాపురంలో పార్టీ కార్యకర్తల సమన్వయ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ.. కార్యకర్తలకు ఏ సమస్య వచ్చినా తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఐదేళ్లు కష్టపడి పార్టీని కార్యకర్తలు అధికారంలోకి తీసుకువచ్చారని అన్నారు.

error: Content is protected !!