News October 6, 2025

HYD: జూబ్లీహిల్స్‌లో పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తాం: కర్ణన్

image

నవంబర్ 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ నిర్వహించనున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈ మేరకు ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గ వ్యాప్తంగా వెంటనే పోస్టర్లు, బ్యానర్లను తొలగిస్తామని, నవంబర్ 14వ తేదీన నగరంలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి మైదానంలో ఓట్ల లెక్కింపు జరుగుతుందన్నారు. ఈసీ నిబంధనలను అందరూ పాటించాలని సూచించారు.

Similar News

News October 7, 2025

HYD: రిజర్వేషన్లను అడ్డుకొని బీసీల పొట్ట కొట్టొద్దు: వీహెచ్

image

సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ వి.హనుమంతరావు తెలిపారు. సుప్రీంకోర్టు పిటిషన్‌లో తాను ఇంప్లిడ్ అయినట్లు చెప్పారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి కాంగ్రెస్ కట్టుబడి ఉందని పేర్కొన్నారు. రిజర్వేషన్లు అడ్డుకొని బీసీల పొట్ట కొట్టొద్దన్నారు.

News October 6, 2025

రంగారెడ్డి: తాగి వస్తున్నాడని తండ్రిని చంపేశాడు..!

image

రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దామర్లపల్లిలో ఈరోజు దారుణం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గ్రామంలో ఓ వ్యక్తి తన తండ్రిని చంపేశాడు. తన తండ్రి మద్యం తాగి ఇంటికి వచ్చి రోజు గొడవ చేస్తున్నాడని దీంతో కోపం వచ్చి కొట్టి చంపానని చెప్పాడు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News October 6, 2025

HYD: పదేళ్ల KCR పాలనలో అభివృద్ధి లేదు: మంత్రి

image

HYD జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో 100% బీసీకే టికెట్ వస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. క్షేత్రస్థాయిలో ఇప్పటికే పర్యటన చేస్తున్నట్లు చెప్పారు. కాంగ్రెస్ అభ్యర్థిని త్వరలో ప్రకటిస్తామన్నారు. జూబ్లీహిల్స్ ప్రజలు విజ్ఞతతో ఓటు వేస్తారని, ఉప ఎన్నికలో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. KCR పదేళ్ల పాలనలో జూబ్లీహిల్స్ అభివృద్ధికి దూరమైందని, కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యమన్నారు.