News February 25, 2025

HYD: జూ పార్క్‌లో టికెట్ ధరలు పెంపు

image

HYD బహదూర్‌పురాలోని నెహ్రూ జూలాజికల్ పార్క్ ఎంట్రీ టికెట్ ధర పెంచినట్లు క్యూరేటర్ తెలిపారు. ఈ మేరకు మంగళవారం ప్రకటన విడుదల చేశారు. చిన్నారులకు రూ. 50, పెద్దలకు రూ. 100 చొప్పున టికెట్ ధరలు నిర్ణయించారు. పార్క్ లోపల సఫారీ, ట్రెయిన్ రైడ్, ఫిష్ ఆక్వేరియం వెళ్లే ధరలు కూడా పెరిగాయి. మార్చి 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వస్తాయని క్యూరేటర్ స్పష్టం చేశారు.

Similar News

News November 19, 2025

సంగారెడ్డి: 20న నిరుద్యోగులకు జాబ్ మేళా

image

SRD జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సెర్ఫ్ (EGMM) ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారిణి జ్యోతి తెలిపారు. ఈ మేరకు సంగారెడ్డిలోని పాత డీఆర్డీఏ కార్యాలయం బైపాస్ రోడ్‌లో 20న ఉదయం 10 గంటలకు మేళా జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం 99664 64500 నంబర్ను సంప్రదించాలన్నారు.

News November 19, 2025

కొనుగోలు వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయాలి: కలెక్టర్

image

ధాన్యం కొనుగోలు వివరాలను సకాలంలో ట్యాబ్‌లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వాహకులతో కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం ఆయన సమావేశం నిర్వహించారు. ధాన్యం కొనుగోలు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత అధికారులపై చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ఐకేపీ, పీఏసీఎస్, మెప్మా, ఎఫ్‌పీఓల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

News November 19, 2025

పెనాల్టీ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: మేయర్

image

అసెస్‌మెంట్‌లకు స్వీయ కొలతలు తప్పుగా నమోదు చేసుకోవడం వల్ల 25 రెట్లు పెనాల్టీ నమోదైన నగర వాసులు, ఈ మినహాయింపు అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ గుండు సుధారాణి కోరారు. మంగళవారం బల్దియా కౌన్సిల్ హాల్‌లో రెవెన్యూ అధికారులతో పన్ను వసూళ్ల పురోగతిపై జరిగిన సమావేశంలో ఆమె అధికారులకు సూచనలు చేశారు.