News January 13, 2026

HYD: జైళ్లలో యువతీ, యువకులే ఎక్కువ

image

తెలంగాణ జైళ్ల యాన్యువల్ రిపోర్టు చూస్తే మతిపోతోంది. సైబర్ క్రైమ్ కేసులు బాంబులా పేలగా, తాగి నడిపి 2,833 మంది లోపలికి వెళ్లారు. మొత్తంగా ఖైదీల సంఖ్య 42 వేలు దాటింది. అందులో Gen Z మెజారిటీ ఉండటం కలవర పెట్టే అంశం. 2025 రిపోర్టు ప్రకారం.. 18,737 మంది యువకులు, 654 మంది యువతులు, 22 ఇతరులు కలిపి 19,413 మంది ఊచలు లెక్కెట్టారు. 2024తో పోలిస్తే నేరాలు చేసిన వారి సంఖ్య 13.31% శాతం పెరగడం గమనార్హం.

Similar News

News February 17, 2026

చనిపోయి 4 రోజులు.. దేవుడు బతికిస్తాడని..

image

TG: HYD కూకట్‌పల్లిలోని ఓ అపార్ట్‌మెంట్లో శైలజ(43) అనారోగ్యంతో చనిపోయింది. దీంతో ఆమెను ఏసుప్రభు మళ్లీ బతికిస్తాడనే మూఢనమ్మకంతో తల్లి శమంతకమణి, తోబుట్టువులు జయరాం, సునీత.. మృతదేహాన్ని ఇంట్లోనే ఉంచి 4 రోజులు ప్రార్థనలు చేశారు. దుర్వాసన రావడంతో అంత్యక్రియలు చేయాలని స్థానికులు చెప్పగా వారితో గొడవకు దిగారు. చివరికి పోలీసులను పిలిపించడంతో మృతదేహాన్ని స్వగ్రామం ఏపీలోని కైకలూరుకి తరలించారు.

News February 17, 2026

అనంత: కోర్టులో ఉద్యోగాలకు పరీక్షలు

image

కోర్టు ఉద్యోగాల రాత పరీక్షలు ఈనెల 19న నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భీమారావు తెలిపారు. అనంతపురం జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలో ఉద్యోగాల భర్తీ కోసం రాత పరీక్షలు శ్రీ బాలాజీ PG కాలేజీ, PVKK ఇంజినీరింగ్ కాలేజీ ఆవరణలో నిర్వహిస్తున్నామన్నారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లు, కావలసిన వస్తువులతో పాటు గంట ముందుగానే హాజరుకావాలని ఒక ప్రకటనలో తెలిపారు.

News February 17, 2026

అన్నమయ్య జిల్లాలో మరో దారుణ హత్య

image

అన్నమయ్య జిల్లాలోని గాలివీడులో స్టోర్ డీలర్ దారుణ హత్యకు గురికావడం తీవ్ర కలకలం రేపుతోంది. మండలంలోని ఒడిసిలెంకవారిపల్లె రేషన్ షాప్ డీలర్ టి. కృష్ణారెడ్డిని కత్తులతో అతి కిరాతకంగా నరికి హత్య చేశారని స్థానికులు తెలిపారు. ఘటనా స్థలానికి డీఎస్పీ చేరుకొని విచారిస్తున్నారు. అలాగే మదనపల్లెలో బాలికను ఓ వ్యక్తి హత్య చేసిన విషయం తెలిసిందే.