News August 3, 2024
HYD: జ్వరాలొస్తున్నాయ్.. జాగ్రత్త!
వాతావరణంలోని మార్పుల కారణంగా భాగ్యనగర ప్రజలు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధుల బారిన పడుతున్నారు. ఈక్రమంలోనే సాధారణంగా HYD ఫీవర్ ఆస్పత్రిలో 100-200 ఓపీ కేసులు నమోదవుతాయి. ప్రస్తుతం ఆ సంఖ్య 300 నుంచి 600కు చేరింది. జులై నెల మొదటి 19 రోజుల్లోనే 7089 ఓపీలు, 54 డెంగ్యూ కేసులు, 108 డిఫ్తీరియా కేసులు నమోదైనట్లు రిపోర్ట్ విడుదల చేశారు. 4 రోజులకు మించి జ్వరం ఉంటే అశ్రద్ధ చేయొద్దని వైద్యులు చెబుతున్నారు.
Similar News
News November 28, 2024
HYD: ఆకర్షణ 18వ లైబ్రరీని ఓపెన్ చేసిన రాష్ట్ర గవర్నర్
8వ క్లాస్ స్టూడెంట్ ఆకర్షణ(13) అనాథాశ్రమాలు, పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ర్ట గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అన్నారు. మూసాపేటలోని సాయి సేవా సంఘం అనాథ పిల్లల ఆశ్రమంలో ఆకర్షణ 18వ లైబ్రరీని గవర్నర్ ప్రారంభించారు. పలు పుస్తకాలను విద్యార్థులకు అందచేశారు. పాకెట్ మనీతో పాటు తాను సేకరించిన పుస్తకాలతో లైబ్రరీలు ఏర్పాటు చేస్తున్న ఆకర్షణ నేటి తరం స్టూడెంట్స్కు ఆదర్శమన్నారు.
News November 28, 2024
HYD: జంతువుల వెచ్చదనానికి ఏర్పాట్లు
సిటీలో రోజురోజుకూ చలి పెరుగుతోంది. దీంతో జూ అధికారులు పక్షులు, జంతువుల రక్షణకు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వెచ్చదనం కోసం జూట్, గన్నీ సంచులు వాడుతున్నారు. అంతేకాక దాదాపు 100 రూమ్ హీటర్లను, విద్యుత్ బల్బులను ఉపయోగిస్తున్నారు. జూలోని జంతువుల శరీర తత్వాన్ని బట్టి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని జూ పార్క్ అధికారులు చెబుతున్నారు.
News November 28, 2024
HYDలో మరో ముఠా.. ప్రజలు జాగ్రత్త..!
HYD ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచించారు. వీధుల్లో లేడీస్ సూట్లు, వెచ్చటి దుప్పట్లు, బెడ్ షీట్లు అమ్ముతూ దోపిడీలకు పాల్పడే ముఠా వచ్చిందన్నారు. ఈ ముఠా సభ్యులు కర్ణాటకలోని బీదర్, గుల్బర్గాలోని గ్యాంగ్‌స్టర్లు బట్టలు అమ్మేవారిగా, చౌకైన వస్తువులను విక్రయించే వారిగా కాలనీల్లోని గృహాలు, షాపుల్లో రెక్కీ నిర్వహిస్తారని శంకర్‌పల్లి సీఐ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.