News January 7, 2026
HYD టాస్క్‌ఫోర్స్‌లో ఒకేసారి 65 మంది పోలీసులు బదిలీ

నగర పోలీస్ శాఖలో ప్రకంపనలు రేపుతూ టాస్క్ ఫోర్స్ టీమ్‌లో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. పారదర్శకత, పనితీరు మెరుగుపరచడమే లక్ష్యంగా 65 మంది సిబ్బందిని బదిలీ చేస్తూ HYD కమిషనరేట్ ఉత్తర్వులు జారీ చేసింది. క్షేత్రస్థాయిలో శాంతిభద్రతలను మరింత బలోపేతం చేసేందుకే ఈ ఆకస్మిక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామం పోలీసు వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
Similar News
News January 30, 2026
గొడవలో ‘వెళ్లి చావు’ అనడం నేరమా?.. కేరళ హైకోర్టు కీలక తీర్పు

భార్యభర్తల గొడవలో ‘బయటికి వెళ్లి.. చావు’ అని అనడం ఆత్మహత్య ప్రేరేపితం కాదని కేరళ హైకోర్టు స్పష్టం చేసింది. ఇవే ఆరోపణలతో అరెస్టయిన ఓ వ్యక్తి శిక్షను రద్దు చేసింది. ప్రాసిక్యూషన్ ప్రకారం.. భర్త అక్రమ సంబంధంపై దంపతుల మధ్య వాగ్వాదం జరిగింది. కోపంలో భర్త ‘వెళ్లి.. చావు’ అని భార్యతో అన్నాడు. దీంతో ఆమె కూతురితో కలిసి సూసైడ్ చేసుకోవడంతో భర్తపై నమోదైన కేసును సెషన్స్ కోర్టు సమర్థించగా, హైకోర్టు కొట్టేసింది.
News January 30, 2026
నల్గొండ: స్వతంత్ర అభ్యర్థుల గుర్తులు ఇవే..!

మున్సిపల్ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులకు కేటాయించేందుకు 75గుర్తులతో కూడిన జాబితాను ఎన్నికల సంఘం విడుదల చేసింది.ఎయిర్ కండిషనర్, ఆపిల్, గాజులు, పండ్ల బుట్ట, బ్యాట్, బాటరీ టార్చ్, బైనాక్యులర్, సీసా, బకెట్, కెమెరా, క్యారం బోర్డు, చెయిన్, కుర్చీ, చపాతీ రోలర్, కోటు, కొబ్బరి తోట, ఫుట్ బాల్, గౌను,గ్రామోఫోన్, గ్యాస్ సిలిండర్, పచ్చి మిర్చి, ద్రాక్ష పండ్లు, బెండకాయ, ఉంగరం, కత్తెర, కుండ తదితర గుర్తులున్నాయి.
News January 30, 2026
రాజమండ్రి: 60 ఏళ్ల తర్వాత రూ.3,000 పెన్షన్..!

అసంఘటిత రంగ కార్మికులు, చిన్న వ్యాపారులకు వృద్ధాప్యంలో ఆర్థిక భద్రత, స్థిర ఆదాయం అందించాలనే లక్ష్యంతో PM-SYM – PM-LVM ద్వారా జాతీయ పెన్షన్ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా సహాయ కార్మిక కమీషనర్ B.S.M వలి శుక్రవారం తెలిపారు. లబ్ధిదారులు 60 సంవత్సరాలు నిండిన తర్వాత జీవితాంతం ప్రతి నెలా రూ.3 పెన్షన్ పొందవచ్చన్నారు. ఆసక్తి గలవారు కార్మిక శాఖ కార్యాలయం, మీ-సేవా కేంద్రంలో సంప్రదించాలన్నారు.


