News August 23, 2025
HYD: ట్రాన్స్‌జెండర్ ఐడీ కార్డుల కోసం ప్రత్యేక శిబిరం

తెలంగాణలోని ట్రాన్స్‌జెండర్లకు ఐడీ కార్డులు, ఆధార్ కార్డుల సవరణలకు ఒక ప్రత్యేక శిబిరం ఆగస్టు 26న హైదరాబాద్‌లోని దివ్యాంగులు, వయో వృద్ధులు, ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖ కార్యాలయంలో నిర్వహించనున్నారు. ఈ శిబిరం ఉదయం 10:30 నుంచి సా.5:30 గంటల వరకు ఉంటుందని ఆ శాఖ డైరెక్టర్ బి.శైలజ ఈరోజు తెలిపారు. ఈ అవకాశాన్ని ట్రాన్స్‌జెండర్లు వినియోగించుకోవాలని కోరారు.
Similar News
News August 24, 2025
ఆగస్టు 24: చరిత్రలో ఈ రోజు

1908: స్వాతంత్ర్యోద్యమకారుడు రాజ్ గురు జననం
1923: భారతీయ పరిశోధకుడు హోమీ సేత్నా జననం
1927: అలనాటి నటి అంజలీదేవి జననం
1928: సాహితీవేత్త దాశరథి రంగాచార్య జననం
1970: సినీ గేయ రచయిత రామజోగయ్య శాస్త్రి జననం
1989: గాయని గీతా మాధురి జననం
2019: కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మరణం
* ఉక్రెయిన్ స్వాతంత్ర దినోత్సవం
News August 24, 2025
పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

జనగామ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలల్లో ఇంజినీరింగ్, ఫార్మసీ, డిగ్రీ, పాలిటెక్నిక్, ఐటీఐ తదితర కోర్సులు చదువుతున్న విద్యార్థులు పోస్టు మెట్రిక్ ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకోవాలని డీబీసీడీవో రవీందర్ తెలిపారు. అర్హత గల విద్యార్థులు సెప్టెంబర్ 30వ తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
News August 24, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.