News January 9, 2026
HYD ట్రాఫిక్ వ్యవస్థలో AI.. మీ కామెంట్?

HYDలో ట్రాఫిక్ ఉల్లంఘనకు చెక్ పెట్టేందుకు AI రాంగ్ వే డిటెక్షన్ వ్యవస్థను ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. రాంగ్ రూట్‌లో వెళ్లినా, హెల్మెట్ లేకపోయినా ఈ కెమెరాలు కనిపెట్టేస్తాయి. కేవలం జరిమానాల మీద దృష్టి పెట్టి, రోడ్ల దుస్థితిని గాలికొదిలేస్తే ప్రయోజనం ఏంటి? అని విమర్శలొస్తున్నాయి. టెక్నాలజీతో భద్రత పెరగడం మంచిదే.. కేవలం చలానాల వసూలు యంత్రంగా AI మారకూడదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీనిపై మీ కామెంట్?
Similar News
News February 2, 2026
గుడ్ న్యూస్: వేగంగా రైల్వే ప్రాజెక్టులు

TG, AP పరిధిలో ఉన్నSC జోన్‌లోని ప్రాజెక్టులను వేగంగా పూర్తిచేసేలా కేంద్రం చర్యలు చేపడుతోంది. ఈ జోన్లో 1,763.26 KMమేర ₹27,342.44 CRతో 18 ప్రాజెక్టులను గతంలో చేపట్టారు. ₹4684 CRతో ముద్ఖేడ్-డోన్ లైన్ విద్యుదీకరణ, ₹3591 CRతో 173 KM పాండురంగాపురం లైన్, ₹3103CRతో విజయవాడ-ఖాజీపేట మధ్య 3వ లైన్ వంటి పనులు పూర్తిచేస్తామని అధికారులు పేర్కొన్నారు. కాగా ఇటీవల SEC-వాడి మధ్య 4వ లైన్‌ను ₹5012 CRతో ఆమోదించింది.
News February 2, 2026
వికారాబాద్ మున్సిపల్ పోరు.. ఎత్తుకు పైఎత్తులు!

మున్సిపల్ ఎన్నికల్లో బలప్రదర్శన చేసేందుకు ప్రధాన పార్టీల నేతలు వ్యూహాలు రచిస్తున్నారు. వికారాబాద్ మున్సిపల్‌లో స్పీకర్ ప్రసాద్ కుమార్ ఛైర్మన్ సీట్ కైవసం చేసుకోవాలని తన కుమార్తెను రంగంలోకి దింపారు. వార్డులను ఏకగ్రీవం చేయాలని వ్యూహంతో ముందుకు సాగుతున్నారు. వారి ప్లాన్‌ను తిప్పికొట్టేలా ప్రతి కాలనీలో TRS, BJPలు అభ్యర్థులను రంగంలోకి దింపారు.
News February 2, 2026
విచారణ దశలోనే ఇల్లీగల్ అని ఎలా అంటారు: హరీశ్ రావు

TG: కేసు దర్యాప్తులో ఉండగానే SIT అధికారి సజ్జనార్ ‘ఇల్లీగల్ ఫోన్ ట్యాపింగ్’ అని పేర్కొనడంపై BRS నేత హరీశ్ రావు అభ్యంతరం తెలిపారు. ‘దీన్ని చూస్తుంటే దర్యాప్తు ఫలితంపై మీరు ముందే ఒక నిర్ణయానికి వచ్చారని అర్థమవుతోంది. ఇది రాజకీయ ప్రేరేపిత పక్షపాత దర్యాప్తు అని స్పష్టమవుతోంది. మీ X ప్రకటనలో కనీసం KCRను ప్రతిపక్ష నేత అని సంబోధించడానికీ ఇష్టపడక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటి?’ అని ప్రశ్నించారు.


