News July 3, 2024

HYD: ట్రేడింగ్‌లో పెట్టుబడులు.. రూ.16.45 లక్షలు స్వాహా

image

ట్రేడింగ్‌లో పెట్టుబడుల పేరుతో సైబర్ నేరగాళ్లు రూ.16.45 లక్షల టోకరా వేశారు. పోలీసులు తెలిపిన వివరాలు.. HYDకు చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి తన ఫేస్‌బుక్ ఖాతాలో ‘ట్రేడింగ్’ గురించి ప్రకటన కంట పడింది. ముందుగా ట్రేడింగ్ గురించి అవగాహన కల్పించారు. నిజమేనని నమ్మిన బాధితుడు రూ.16.45 లక్షలు పెట్టుబడి పెట్టేశాడు. ఆ తర్వాత అవతల వ్యక్తుల ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News November 11, 2025

జూబ్లీబైపోల్: మోడల్ బూత్‌లు.. మొబైల్ డిపాజిట్ కౌంటర్లు

image

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. నియోజకవర్గంలో 5 మోడల్ పోలింగ్ బూత్‌ల వద్ద ఓటర్ అసిస్టెన్స్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఓటర్ల సౌకర్యార్థం, పోలింగ్ బూత్‌లోకి అనుమతి లేని మొబైల్ ఫోన్‌లను భద్రపరిచేందుకు ప్రత్యేక డిపాజిట్ కౌంటర్లు అందుబాటులోకి వచ్చాయి. ఓటింగ్ సజావుగా జరిగేలా చూసేందుకు, పలు పోలింగ్ కేంద్రాల్లో ఇప్పటికే మాక్ పోలింగ్ (అనుకరణ పోలింగ్) ప్రారంభమైంది.

News November 11, 2025

HYD: ఈ రోజు సెలవు.. మీ పని ఇదే!

image

జూబ్లీహిల్స్‌లో నేడు ఓటింగ్ డే. సెలవు దొరికింది.. ఇంటిదగ్గర చిల్ అవుదాం అనుకుంటున్నావా? రేపు మోరీ నిండింది, వర్షం పడి రోడ్లు బ్లాక్ అయ్యాయి, గుంతలు పడ్డాయి అని ప్రజాప్రతినిధులని ప్రశ్నిస్తే నిన్ను పట్టించుకోరు. ఆ.. ‘నా ఒక్క ఓటుతో ఏం మారుతుందిలే’ అనుకోవచ్చు.. ఒక్క ఓటుతో ఫలితాలు తారుమారు ఆయన ఘటనలు చాలా ఉన్నాయి. ఓటేసి ఓ సెల్ఫీ పెట్టు. ఇష్టమైన సినిమా కోసం పెట్టే శ్రద్ధ.. మీ ప్రాంతం కోసం కూడా పెట్టు.

News November 11, 2025

ఈసారి జూబ్లీహిల్స్‌ ఆదర్శం కావాలి.. ఓటెత్తి తీరాలి..!

image

2009లో జూబ్లీహిల్స్‌ నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో అత్యధిక మంది ఓటేసింది ఎప్పుడంటే 2009లోనే.. అప్పుడు 52 శాతం మంది ఓటు వేశారు. ఆ తరువాత ఈ ఓటింగ్‌ శాతం తగ్గుతూ వస్తోంది. ఈ ఉపఎన్నికలో ఓటింగ్‌ శాతం పెరుగుతుందని అందరూ భావిస్తున్నారు. ప్రతి ఎన్నికల ముందూ ఇలానే అనుకుంటారు. కానీ అలా జరగడం లేదు. మరి నేడైనా అందరూ పోలింగ్‌ కేంద్రాలకు కదలి ఓటెత్తి ఆదర్శంగా నిలవాలి.