News October 3, 2025

HYD: డబుల్ బెడ్ రూం పట్టాల పంపిణీ

image

మినిస్టర్ క్వార్టర్స్‌లో డబుల్ బెడ్ రూం పట్టాలు పంపిణీ చేశారు. శుక్రవారం మంత్రి పొన్నం, మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. అంబర్‌‌పేట-134, బహుదూర్‌పురా-294, బండ్లగూడ-155, చార్మినార్-209, సైదాబాద్‌లో 206‌ మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసినట్లు అధికారులు వెల్లడించారు. కోర్టు నుంచి క్లియరెన్స్ వచ్చిన అనంతనం పట్టాలు పంపిణీ చేసినట్లు పొన్నం తెలిపారు.

Similar News

News October 3, 2025

హైకోర్టు తీర్పు ప్రకారమే అనుమ‌తి పున‌రుద్ధ‌ర‌ణ

image

హైకోర్టు తీర్పును అనుసరించి రంగారెడ్డి జిల్లా మంచిరేవులలో ఆదిత్య కంపెనీ నిర్మాణ సంస్థకు అనుమ‌తుల్ని పున‌రుద్ధ‌రించామ‌ని హెచ్ఎండీఏ వెల్లడించింది. ఎలాంటి నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న జ‌ర‌గ‌లేద‌న్నారు. 2022లో ఆదిత్య కేడియా మంచిరేవులో 9.19 ఎక‌రాల్లో బ‌హుళ అంత‌స్తుల భ‌వ‌న నిర్మాణానికి హెచ్ఎండీఏ అనుమ‌తిని జారీ చేసిందని చెప్పారు. కోర్టు తీర్పుతో పలు మార్పులు, పరిశీలనలు చేసి అనుమతులు పున‌రుద్ధ‌రించారు.

News October 3, 2025

షాద్‌నగర్: అమ్మవారి చీరల వేలం@రూ.13లక్షలు

image

నవరాత్రులను పురస్కరించుకొని 11 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా షాద్‌నగర్ నియోజకవర్గం పరిధిలోని మధురాపూర్ గ్రామంలో అమ్మవారికి 11రోజుల పాటు అలంకరణలో ఉపయోగించిన 11 చీరలకు వేలంపాటను నిర్వహించారు. వేలం పాటలో 11 చీరలను రూ.13,55,149కు గ్రామస్థులు దక్కించుకున్నారు. గతంలో వినాయకుడి లడ్డును కూడా రూ.12 లక్షలు దక్కించుకోవడం గమనార్హం.

News October 3, 2025

రంగారెడ్డి: ఎన్నికల కోసం 12 విభాగాల ఏర్పాటు

image

రంగారెడ్డి జిల్లాలో 21 ZPTC, 230 MPTC, 526 గ్రామపంచాయతీలు, 4,668 వార్డులకు ఎన్నికలు నిర్వహించనుంది. ఇందుకు ఎన్నికల కమిషన్ 12 విభాగాలను ఏర్పాటు చేసింది. వీటికి ఒక్కో నోడల్ అధికారిని నియమించింది. అయితే పోలింగ్‌కి ఎంతమంది సిబ్బంది అవసరం?, ఓటింగ్‌లో ఎవరు పాల్గొనాలి?, కౌంటింగ్‌లో ఎవరు పాల్గొనాలి? తదితర పనుల పర్యవేక్షణకు HR విభాగాన్ని ఏర్పాటు చేసింది.